Home Cinema Ram Charan: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చిరంజీవి రామ్ చరణ్ కాంబినేషన్ లో మరో క్రేజీ...

Ram Charan: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చిరంజీవి రామ్ చరణ్ కాంబినేషన్ లో మరో క్రేజీ మూవీ..

Ram Charan: RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తో పాన్ వరల్డ్ రేంజ్ క్రేజ్ ని సొంతం చేసుకున్న రామ్ చరణ్, ఆ చిత్రం విడుదలై కేవలం నెల రోజుల వ్యవధిలోనే తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటించిన ‘ఆచార్య’ అనే చిత్రం ద్వారా మన ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన పరాజయం పాలైంది. అపజయం అనేదే ఎరుగని కొరటాల శివ లాంటి డైరెక్టర్ నుండి ఇంత నాసిరకపు సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు (Ram Charan Chiranjeevi Multistarrer). తండ్రి కొడుకులు కలిసి సినిమా చేస్తే ఏ రేంజ్ లో ఉండాలని అభిమానులు కోరుకున్నారో, ఆ రేంజ్ కి ఈ చిత్రం కనీస స్థాయిని కూడా చేరుకోలేకపోయింది.

ram-charan-chiranjeevi-multistarrer-prashanth-neel

ఫలితంగా ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. భవిష్యత్తులో మళ్ళీ ఈ కాంబినేషన్ లో సినిమా చూడలేమని ఫ్యాన్స్ బాధపడ్డారు. అలా బాధ పడే అభిమానులకు ఇప్పుడు ఒక శుభవార్త, మళ్ళీ చిరంజీవి – రామ్ చరణ్ కాంబినేషన్ లో ఒక పూర్తి స్థాయి మల్టీ స్టార్రర్ చిత్రం రాబోతుంది అట. కేజీయఫ్ సిరీస్ మరియు సలార్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించబోతున్నాడట. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దివీవీ దానయ్య నిర్మించబోతున్నాడు (Ram Charan Chiranjeevi Multistarrer). ఇప్పటికే ఈ సినిమాకి సంబందించి చర్చలు కూడా పూర్తి అయ్యాయి.

నవంబర్ నుండి ‘సలార్’ రెండవ భాగం తెరకెక్కించబోతున్నారు, ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వగానే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రారంభిస్తారట. ఇక ఈ సినిమా గురించి మరికొన్ని వివరాలు ఆగష్టు 22 వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా అధికారికంగా ప్రకటించబోతున్నారట. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకి వెయ్యి కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చెయ్యబోతున్నారని సమాచారం. మాములు యాక్షన్ సినిమాకి ఇంత ఖర్చు చెయ్యాల్సిన అవసరం లేదు, అలాంటిది వీళ్లిదరి కాంబినేషన్ లో ఏ జానర్ సినిమా రాబోతుంది? ఎందుకు ఇంత బడ్జెట్ అవుతుంది అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

రామ్ చరణ్ ప్రస్తుతం సినిమాల నుండి బ్రేక్ తీసుకుని, భార్యతో మరియు మొన్ననే పుట్టిన కూతురు క్లిన్ కార కొణిదెలతో సమయం గడుపుతూ తండ్రితనం ఎంజాయ్ చేస్తున్నాడు. మరి కొన్ని నెలలు బ్రేక్ తీసుకొని సినిమా షూటింగ్ లకు తిరిగి వస్తాడు అని సమాచారం. కానీ ఆ బ్రేక్ ఎన్ని నెలలో కరెక్ట్ గా ఎవ్వరికి తెలీదు, ఫాన్స్ మాత్రం రామ్ చరణ్ తరువాత మూవీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఈ మల్టీ స్టార్రర్ సినిమా గాని స్టార్ట్ ఐతే ఫాన్స్ కి మాత్రం పూనకాలే.

Exit mobile version