Friday, September 20, 2024
HomeCinemaRam Charan-Rana: అర్థరాత్రి రూమ్ లో కూర్చొని రామ్ చరణ్ రానా చేసే పనులు ఇలాంటివా..

Ram Charan-Rana: అర్థరాత్రి రూమ్ లో కూర్చొని రామ్ చరణ్ రానా చేసే పనులు ఇలాంటివా..

Ram Charan-Rana: ఇండస్ట్రీ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే అందరూ చెప్పుకొచ్చే పేర్లలో ముందు వరుసలో ఉంటారు రామ్ చరణ్ – రానా. వీళ్లిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని చూస్తే ఎవరికైనా మన స్నేహితులతో ఉండే బాండింగ్ గుర్తుకు వస్తాది. స్కూల్ రోజుల నుండి వీరి మధ్య ఉన్న స్నేహం, వీళ్లిద్దరు చేసే చిలిపి చేష్టలు గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇక కష్టసమయం వచినప్ప్పుడు ఒకరికి ఒకరు ఎంతో తోడు గా ఉంటారు, ముఖ్యంగా రానా తాతయ్య దగ్గుపాటి రామానాయుడు చనిపోయినప్పుడు రానా ఎంతలా ఏడ్చాడో మన అందరం కళ్లారా చూసాము.

rana-daggubati-ram-charan

ఆ సమయం లో రామ్ చరణ్ అక్కడికి వచ్చినప్పుడు ఆయనని పట్టుకొని వెక్కిళ్లు పెట్టి మరీ ఏడుస్తాడు రానా, ఈ వీడియో చూస్తే వాళ్ళిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉంది అనే విషయం అర్థం అవుతుంది. ఇక వీళ్లిద్దరు చేసే చిలిపి చేష్టల గురించి మెగాస్టార్ చిరంజీవి ఒక షో లో బహిరంగంగా చెప్తాడు. అదేమిటంటే రానా రామ్ చరణ్ తో అప్పట్లో కంబైన్ స్టడీస్ చెయ్యడానికి వచ్చేవాడు. వాళ్లిద్దరూ రూమ్ కి వెళ్లిన తర్వాత ఎంతసేపు అయినా బయటకి వచ్చేవారు కాదు, అబ్బో బిడ్డలిద్దరూ ఎంత కస్టపడి చదువుతున్నారో అని అనుకునేవాడట చిరంజీవి. ఒకరోజు ఎదో మామూలుగా పలకరించడానికి లోపలకు వెళ్తే ఇద్దరు రూమ్ లో లేరు.

rana-ram-charan-childhood

ఎక్కడికి వెళ్లారు అబ్బా అని వెతుకుతూనే కిటికీ బోల్టులు ఒక మూలాన చక్కగా పేర్చిపెట్టడం గమనించాను. అంటే వీళ్లిద్దరు కంబైన్ స్టడీస్ పేరు చెప్పుకొని కిటికీ లో నుండి బయటకి దూరి పారిపోతున్నారు అన్నమాట అనే విషయాన్నీ అర్థం చేసుకున్నాను. సుమారుగా రెండు నుండి మూడు గంటల వరకు హైదరాబాద్ మొత్తం తిరిగి వచ్చేవాళ్ళు వీళ్లిద్దరు. ఇంకా వీళ్ళ గురించి చెప్పాల్సినవి చాలానే ఉన్నాయి అంటూ చిరంజీవి అప్పట్లో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యాయి. ఇది ఇప్పుడు మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది(Ram Charan-Rana).

ram-charan-rana

ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ , రానా పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించిన సంగతి అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ సూపర్ స్టార్ స్టేటస్ లో ఉండగా, రానా మాత్రం ఇంకా మీడియం రేంజ్ లెవెల్ లోనే ఉన్నాడు. ఆయన ఇలా రేస్ లో వెనకబడిపోవడానికి కారణం అతనికి ఉన్న ఆరోగ్య సమస్యలే అని రానా ఎన్నో సందర్భాలలో తెలిపాడు కూడా. రామ్ చరణ్ చేయబోతున్న తరువాయి తెలుగు సినిమా పేరు గేమ్ చేంజెర్. ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక రానా విషయానికి వస్తే జవాన్ అనే సినిమా చేస్తున్నాడు, ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ న రిలీజ్ కు రెడీగా ఉంది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts