Sunday, July 7, 2024
HomeCinemaRam Charan : RC 16 గురించి అదిరిపోయే న్యూస్.. ఫాన్స్ కు పండగే..

Ram Charan : RC 16 గురించి అదిరిపోయే న్యూస్.. ఫాన్స్ కు పండగే..

Ram Charan : మునుపెన్నడూ లేనంతగా నేడు తెలుగు హీరోల స్టేటస్ చాలా పెరిగిపోయింది. అందుకే చాలా మంది పాన్ ఇండియా స్టార్లుగా తమ సత్తా చాటుతున్నారు. అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ లిస్ట్ లో మొదటి ప్లేస్ లో ఉంటాడు. ఒక్కో సినిమాతో తన సత్తా చాటుకుంటూ దూసుకెళ్తున్న ఈ మెగా హీరో సరైన దిశలో తన కెరీర్ ను నడిపిస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ చాలా సినిమాలను ప్రకటించాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ ఎస్.శంకర్ తో గేమ్ ఛేంజర్ అనే ఫిలిం చేస్తున్నాడు.

ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందించబడింది. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే బుచ్చిబాబు సానతో రామ్ చరణ్ తన 16వ సినిమా చేయడానికి అంగీకరించాడు. బుచ్చిబాబు సాన తీస్తున్న ఈ చిత్రం క్రీడా నేపథ్యంతో ఉంటుందని ఇప్పటికే వెల్లడించారు. హీరో రామ్ చరణ్ కబ్బాడి ప్లేయర్‌గా నటిస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ram-charan-rc-16-update-is-here-festival-for-fans

గేమ్ ఛేంజర్ పూర్తయిన వెంటనే ఈ చిత్రం నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. క్రీడా నేపథ్యంతో భారీ ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా కోసం బుచ్చిబాబు సన శరవేగంగా సిద్ధమవుతున్నారు. అతను ఇప్పటికే సంబంధిత స్క్రిప్ట్ మరియు ప్రతిదీ సిద్ధం చేశాడు. హై స్టాండర్డ్‌తో ఈ సినిమా ఈ ఏడాదిలో షూటింగ్ ను మొదలుపెడుతున్నారట. ఎందుకంటే ఈ సినిమా కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా ఓ మాక్ ఓవర్ చేయాలని నిర్ణయించుకునారట. దీనికి అతనికి 6 నెలల సమయం పడుతుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts