Home Cinema Ram Charan : సినిమాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్..

Ram Charan : సినిమాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్..

Ram Charan : ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో రామ్ చరణ్ ఇప్పుడు ఏ స్థాయిలో ఎదిగాడో మనకు తెలిసిందే. నాన్న చిరంజీవి పేరుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన తనదైన శైలిలో దూసుకుపోతూనే ఉన్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా నిలదొక్కుకోగలిగాడు. అయితే ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా రామ్‌ చరణ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రామ్ చరణ్ తన కూతురు తన మెమొరబుల్ మూమెంట్స్ పంచుకున్నారు.

ఇటీవల రామ్ చరణ్ ఓ ట్వీట్ కూడా చేసారు. అందులో అతను తన కూతురు క్లింకరపై ఉన్న ప్రేమను తెలిపారు మరియు కొన్ని ఫోటోలను షేర్ చేసారు. ప్రతి తండ్రికి తన కూతురులు అంటే ప్రాణం. అయితే క్లింకర కోసం సినిమా విషయంలో రామ్ చరణ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు అంట. రామ్ చరణ్ ఎక్కడ ఉన్నా కూతురు స్కూల్ కి వెళ్లే వయసు వచ్చే వరకు ఆరు గంటలకల్లా ఇంటికి వచ్చేస్తాడు.

ram-charan-decision-on-films-disappoints-fans

చిత్రీకరణ షెడ్యూల్‌తో సంబంధం లేకుండా, రామ్ చరణ్ తన కుమార్తెతో ఎక్కువ సమయం గడపడానికి నెమ్మదిగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు అని తెలుస్తుంది. ఈ విషయం విని అభిమానులు షాక్ అవుతున్నారు. మరోవైపు కూతురు కోసం ఏ తండ్రైన ఇలానే చేస్తారు అని కూడా అనుకుంటున్నారు. ఎంతటి గొప్ప హీరో అయినా తండ్రి స్థానాన్ని ఆస్వాదించక తప్పదు అంటూ రామ్ చరణ్ ను మెచ్చుకుంటున్నారు.

Exit mobile version