Home Cinema Rambha : ఆ స్టార్ హీరోతో రంభకు గొడవ.. కారణం ఏంటంటే..

Rambha : ఆ స్టార్ హీరోతో రంభకు గొడవ.. కారణం ఏంటంటే..

Rambha : ఇండస్ట్రీలో సాధారణంగా గొడవలు ఉంటాయి. కొంతమంది వాటిని తేలికగా తీసుకుంటే, మరికొందరు సీరియస్‌గా తీసుకుంటారు. ఈ గొడవల వల్ల చాలా ఏళ్లుగా ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. అలాగే హాట్ బ్యూటీ రంభ కూడా చిన్న వివాదం కారణంగా అక్కినేని నాగార్జునతో సినిమాలు చేయలేకపోయారు. ఆ తర్వాత నాగ్‌తో నటించేందుకు హీరోయిన్లు వరుస కట్టారు. అయితే నాగార్జునతో చాలా సార్లు నటించే అవకాశం వచ్చినా రంభ నో చెప్పింది అంట.

అయితే, నాగార్జున కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో హలో బ్రదర్ ఒకటి. ఈవీవీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, సౌందర్య కథానాయికలుగా నటిస్తే, నాగార్జున ద్విపాత్రాభినయం చేశారు. కానీ రమ్యకృష్ణ కంటే ముందు దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఆ పాత్ర కోసం రంభా ని అనుకున్నారు. ఆమెతో సంప్రదింపులు జరిపి తేదీలు కూడా ఫిక్స్ చేసుకున్నారు. అయితే రమ్యకృష్ణ తనకు కావాలని నాగార్జున పట్టుబట్టడంతో క్రియేటర్స్ రంభను వదులుకుని రమ్యకృష్ణను తీసుకున్నారు.

actress-rambha-had-issues-with-tollywood-star-hero-nagarjuna-due-to-this-reasons

ఈ సినిమా హిట్ అయింది. అప్పట్లో దాదాపు పది లక్షల రూపాయల షేర్ల కలెక్షన్స్ రాబడి అందరిని షేక్ చేసింది. ఇక నాగార్జున తనను రిజెక్ట్ చేశాడని తెలియగానే రంభ అతనిపై ద్వేషం పెంచుకుంది. తర్వాత నాగార్జున తో కలిసి నటించే అవకాశం వచ్చినా తనను రిజెక్ట్ చేసిన హీరోతో ఇలా చేయనని చెప్పింది. దీంతో రంభ ఇప్పటి వరకు ఈయన తో స్క్రీన్ షేర్ చేసుకోలేదు. కానీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కోరిక మేరకు అదే సినిమాలోని ఓ పాటలో ఆమె తలకున్న మెరిసింది. అదే పాట కన్నెపేట్టారో .

Exit mobile version