Home Cinema Ram Charan: మధ్యలోనే ఆగిపోయిన రామ్ చరణ్ గేమ్‌ ఛేంజర్‌ సినిమా షూటింగ్.. ఇంక మొదలు...

Ram Charan: మధ్యలోనే ఆగిపోయిన రామ్ చరణ్ గేమ్‌ ఛేంజర్‌ సినిమా షూటింగ్.. ఇంక మొదలు అవ్వనట్టే..

Game Changer Shooting: RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత పాన్ వరల్డ్ క్రేజ్ ని సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రాజమౌళి లాంటి పాన్ ఇండియన్ డైరెక్టర్ తో చేసిన తర్వాత వెంటనే మరో పాన్ ఇండియన్ డైరెక్టర్ శంకర్ తో చేసిన ఏకైక నేటి తరం హీరో గా రామ్ చరణ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అయితే ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు రాను రాను బాగా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే అప్పుడెప్పుడో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.

ram-charan-game-changer-movie-shooting-stopped

వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సి ఉంది, కానీ షూటింగ్ ఆలస్యం అవుతూ రావడం తో ఎప్పుడు పూర్తి అవుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడడం తో అభిమానులు తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా లో దిల్ రాజు ని ట్యాగ్ చేసి రామ్ చరణ్ అభిమానులు బండ బూతులు తిడుతున్నారు. కానీ మూవీ టీం నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు(Game Changer Shooting ). కనీసం చిత్రం పై బజ్ ఏర్పడడానికి ఒక్క చిన్నపాటి టీజర్ కానీ, గ్లిమ్స్ వీడియో కానీ విడుదల చెయ్యమని అభిమానులు కోరుతున్నారు. కానీ మూవీ టీం నుండి మాత్రం నో రెస్పాన్స్.

గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లోనే మధ్యలో శంకర్ కమల్ హాసన్ తో ‘ఇండియన్ 2 ‘ షూటింగ్ కూడా ప్రారంభించాల్సి వచ్చింది. దాంతో నెలలో 15 రోజులు ఆ సినిమాకి, మరో 15 రోజులు గేమ్ చేంజర్ చిత్రానికి కేటాయిస్తూ వచ్చాడు శంకర్. అలా షూటింగ్ కూడా ఆలస్యం అవుతూ వచ్చింది. రీసెంట్ గానే లేటెస్ట్ షెడ్యూల్ ప్రారంభం అయ్యింది, ఇందులో రామ్ చరణ్ తో పాటుగా మూవీ లో నటించే ప్రధాన పాత్రధారులు మొత్తం హాజరయ్యారు. ఇప్పుడు ఈ షెడ్యూల్ కూడా ముగిసిపోయింది. తదుపరి షెడ్యూల్ ఎప్పుడు మొదలు అవుతుందో ఎవ్వరూ ఊహించలేని పరిస్థితి.

దీంతో ఫ్యాన్స్ మళ్ళీ ఫ్రస్ట్రేషన్ కి గురి అవుతున్నారు, ఇక దీనిపై మూవీ టీం ఎలా రెస్పాండ్ అవ్వబోతుందో చూడాలి. ఈ చిత్రం లో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుండగా, శ్రీకాంత్ , ఎస్ జె సూర్య , సునీల్ , అంజలి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రామ్ చరణ్ rrr సినిమా తరువాత, తనకు కూతురు పుట్టిన తరువాత చేస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమా పై ఫాన్స్ కి పెద్ద అంచనాలే ఉన్నాయి, కాని గదికి ఓకే సారి ఇలాంటి వార్తలు విని మెగా ఫాన్స్ ఎంతో నిరాశచెందుతున్నారు. ఈ సినిమా కానీ హిట్ ఐతే రాజమౌళితో సినిమా చేసి తరువాత సినిమా కూడా హిట్ కొట్టిన ఏకైక హీరో గా రామ్ చరణ్ రికార్డు సృష్టిస్తాడు.

Exit mobile version