Friday, July 5, 2024
HomeUncategorizedRamoji Rao : తుదిశ్వాస విడిచిన రామోజీరావు.. తరలి వస్తున్న సినిమా ప్రముఖులు..

Ramoji Rao : తుదిశ్వాస విడిచిన రామోజీరావు.. తరలి వస్తున్న సినిమా ప్రముఖులు..

Ramoji Rao : రామోజీ ఫిలిం సిటీ మరియు ఈనాడు మీడియా అధినేత రామోజీరావు ఈరోజు కన్నుమూశారు. పలు అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా మంచాన పడ్డాడు ఈయన. నిన్న మధ్యాహ్నం అస్వస్థతకు గురికావడంతో స్టార్ హాస్పిటల్ వైద్యులు చికిత్స అందించారు. ఆయనకు ఇటీవల గుండె సంబంధిత సమస్య వచ్చి స్తంట్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిన్నటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, నిన్న రాత్రి కూడా వెంటిలేటర్‌పై ఉంచినట్లు సమాచారం.

ఆయన మరణాన్ని అధికారికంగా ప్రకటించారు మరియు ఈ ఉదయం 4:50 గంటలకు తుది శ్వాస విడిచారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో పార్దివ దేహాన్ని ఫిల్మ్ సిటీలోని స్వగృహానికి తరలించారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో జన్మించిన రామోజీ రావు ఈరోజు మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా పచ్చడ్లు మరియు మీడియా సంస్థలను స్థాపించారు. ఈయన నిర్మాతగా కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ramoji-rao-passed-away-due-to-age-related-issues

భారత ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్‌ను కూడా అందుకున్నారు. దాగుడుమూతుల దండాకోర్ సినిమా రామోజీ రావు చివర నిర్మించిన చిత్రం. ఈ చిత్రం 2017లో విడుదలైంది. ఆయన అంత్యక్రియలకు సంబంధించిన పూర్తి వివరాలను కుటుంబ సభ్యులు ఇంకా వెల్లడించలేదు. అధికారికంగా ఈ విషయాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈయన మరణ వార్తా తెలవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు తరలి వస్తున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts