Ramoji Rao : వ్యాపార రంగంలోనూ, సినిమా రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామోజీరావు మీడియా మొగల్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆయన స్థాపించిన ఈనాడు మరియు ఈటీవీ అటు ప్రింట్ మీడియా ఇంకా టీవీ మీడియాలలో వీక్షకులను బాగా ఆదరించాయి. అయితే రామోజీరావు శనివారం అనారోగ్య కారణాలతో మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఇక రామోజీరావు మరణానంతరం ఆయన గురించి ఎవరికీ తెలియని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
మరి కొన్ని వర్గాల సమాచారం ప్రకారం రామోజీ రావు ప్రాపర్టీ విలువ దాదాపు 46,000 కోట్లు అని తెలుస్తుంది. కానీ రామోజీరావు రామోజీ ఫిల్మ్ సిటీని స్థాపించి ఇంత ఆస్తి సంపాదించాడు అనుకోకండి. అతను అనేక సంస్థలకు మరియు చిత్రాలకు నిర్మాతగా కూడా పనిచేశాడు. అయితే ఈ వేల కోట్ల సంపదలో సగం ఇప్పటికే రామోజీరావు తన ఇద్దరు కొడుకులకు పంచిపెట్టారు అని సమాచారం. మిగిలిన ఆస్తులు అతని భార్య పేరు మీదనే ఉన్నాయి.
అయితే ప్రస్తుతం ఈ ఆస్తి గురించి ఆసక్తికర వార్తలు ఇంటర్నెట్ లో గుప్పుమంటున్నాయి. అయితే రామోజీ రావు యొక్క వీలునామాలో ఆస్తులు వారసులకు చెందినది కాబట్టి, రామోజీ రావు ఆస్తి అతని మనవళ్లకు వెళుతుంది. ఇపుడు ఈ వార్త ట్రెండ్ అవుతుంది. ఇదిలా ఉంటే, రామోజీ రావు అంతక్రియలు మొన్న జరిగాయి. ఈయన చివరిచూపు కోసం టాలీవుడ్ సెలబ్రిటీస్ తో పాటు రాజకీయనాయకులు కూడా ఉన్నారు. మరికొందరు ట్విట్టర్ ద్వారా తమ నిలవాళ్ళు అర్పించారు.