Rashmika Movie Offers: సౌత్ లో మోస్ట్ క్రేజీయస్ట్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే, అందులో ప్రముఖ హీరోయిన్ రష్మిక మండన పేరు కచ్చితంగా ఉంటుంది. ‘చలో’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా రష్మిక ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో టాలీవుడ్ లో వరుసగా ఆఫర్ల వెల్లువ కురిసింది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ హిట్టు మీద హిట్టు కొట్టి నెంబర్ 1 హీరోయిన్ గా నిల్చింది. ఈమె ఎంట్రీ కారణంగా అప్పటి వరకు ఇండస్ట్రీ లో టాప్ స్థానం లో కొనసాగిన కొంతమంది స్టార్ హీరోయిన్స్ ఫేడ్ అవుట్ అయిపోయారు.
టాలీవుడ్ లో వరుస హిట్స్ తో లక్కీ హీరోయిన్ గా మారిన ఈమె, ఈ ఏడాది కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి ఏకంగా ఇలయథలపతి విజయ్ హీరో గా నటించిన ‘వారసుడు ‘ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అంతంత మాత్రం గానే ఉన్నప్పటికీ రష్మిక అడుగుపెట్టిన వేలావిశేషమో ఏమో తెలియదు కానీ,ఈ చిత్రం కూడా పెద్ద హిట్ అయ్యింది (Rashmika Movie Offers). ఇక అల్లు అర్జున్ తో చేసిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఫేమ్ ఎలాగో ఉంది. అందువల్ల ఈమెకి బాలీవుడ్ లో కూడా వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. రీసెంట్ గానే ఈమె ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన ‘ఎనిమల్’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమాకి అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం హిట్ అయితే రష్మిక రేంజ్ మాములుగా ఉండదు, ఎవ్వరూ కలలో కూడా అందుకోలేని రేంజ్ కి వెళ్ళిపోతుంది,అయితే ఈమెకి ఇంతలా అవకాశాలు రావడానికి కారణం ఆమె మంచి తనం అని కూడా అంటుంటారు. రెండు హిట్ సినిమాలు చేశాను కదా,నా రెమ్యూనరేషన్ భారీ గా పెంచేస్తాను అనే టైపు కాదు ఈమె. నిర్మాతలకు ఎలాంటి ఒత్తిడి పెట్టకుండా, ఎంత రెమ్యూనరేషన్ ఇస్తే అంత తీసుకుంటుంది అట. అందుకే ఆమెతో సినిమాలు చెయ్యడానికి దర్శక నిర్మాతలు అమితాసక్తిని చూపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.
ఈమె ఒక్కో సినిమాకి రెండు నుండి మూడు కోట్ల రూపాయిలు తీసుకుంటుందట. పుష్ప సినిమా తర్వాత నుండి 5 కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. రష్మిక మొన్ననే తన షూటింగ్ షెడ్యూల్ మొదలు పెట్టింది పుష్ప 2 సినిమా కోసం. ఈ సినిమాకి రష్మిక ఎంత తీసుకుంటుందో ఇంకా వెల్లడించలేదు సినిమా బృందం. ఈ సినిమాని ఈ ఏడాది చివరిలోపు పూర్తిచేసుకుని ఒచ్చే ఏడాది రిలీజ్ చేదాం అని ఫిక్స్ అయ్యారు పుష్ప టీం.