Rashmika Mandanna : సినిమా ఇండస్ట్రీలో రష్మిక మందన్న క్రేజీ ఏ లెవెల్లో ఉంది అనేది మన అందరికి తెలిసినదే. స్టార్ హీరోలకు ఉండే క్రేజ్ ఈ నటికి ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తన ప్రతి సినిమాను ప్రమోట్ చేయడానికి రష్మిక మందనను ఉపయోగించుకుంటాడు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ వార్తలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ అవన్నీ అవాస్తవం అంటూ చెప్పేస్తున్నారు వీరిద్దరూ. తాజాగా రష్మిక ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ఆనంద్ దేవరకొండ తాజా చిత్రం గం గం గణేశా. మే 31న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో ఫ్రీ రిలీజ్ నిర్వహించారు చిత్ర యూనిట్. అదే క్రమంలో ఆమె పెంపుడు జంతువులతో కలిసి దిగిన ఫోటోలు, సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయాల గురించి అడుగుతారు.
వారు రష్మిక పెంపుడు జంతువును మరియు విజయ్ పెంపుడు జంతువును చూపించి, మీకు ఏది బాగా ఇష్టం అని అడుగుతారు. రష్మిక తన పెట్ ను మొదటి సంతానం మరియు విజయ్ పెట్ ను రెండవ సంతానం అని చెప్పింది. అలాగే, తన ఫేవరెట్ కో-స్టార్ ఎవరని అడిగినప్పుడు, రష్మిక మైక్ కింద పెట్టి, ఆనంద్ ను తిట్టింది. వెంటనే మైక్రోఫోన్ దగ్గరకు వచ్చి, నువ్వు నా కుటుంబంరా, నువ్వే నన్ను ఇరికించేలా ఉన్నావు అంటూ అంటుంది. అంటే విజయ్, రష్మికల బంధాన్ని పరోక్షంగా బయటపెట్టింది అని అభిమానులు భావిస్తున్నారు.