Sunday, July 7, 2024
HomeCinemaRashmika Mandanna : బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మిక మందన్న.. ఆ మెగా హీరోతో రొమాన్స్..

Rashmika Mandanna : బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మిక మందన్న.. ఆ మెగా హీరోతో రొమాన్స్..

Rashmika Mandanna : తాజాగా రష్మిక మందన్న నిర్ణయాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. రష్మిక మందన్నకు పాతతరం హీరోలతో నటించడం ఇష్టం లేదన్న సంగతి తెలిసిందే. తనకున్న పాపులారిటీ కారణంగా యంగ్ హీరోలతో నటించడానికే రష్మిక మొగ్గు చూపుతుంది. ఆమె సీనియర్ హీరోల పక్కన నటించడానికి ఆసక్తి చూపదు. అయితే ఇప్పుడు రష్మిక తీసుకున్న నిర్ణయం అభిమానులను షాక్‌కి గురిచేస్తుంది. చిరంజీవితో కలిసి పని చేసేందుకు రష్మిక సిద్ధమైంది.

తాజాగా ఈ వార్తకు టాలీవుడ్ సర్కిల్స్‌లో మంచి స్పందన వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో కథానాయికగా త్రిష ఎంపికైంది. అయితే ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించేందుకు రష్మిక మందన్నను దర్శకుడు వశిష్ట సంప్రదించారు అని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రష్మిక మందన్న ఈ పాత్రకు సరిపోతుందని సూచించాడు అంట.

rashmika-mandanna-to-act-in-chiranjeevi-vishwabara-cinema

వశిష్ట రష్మికను అడగానే అంగీకరించడం గమనార్హం. గతంలో బాలయ్య సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి రష్మిక నిరాకరించింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదనంగా, బుచ్చిబాబు సాన, రామ్ చరణ్ కాంబోలో రాబోయే చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా ఎంపికైంది. మెగా హీరోలతో ఇలా వరుసగా పనిచేస్తూ మెగా ఫ్యామిలీకి మరింత దగ్గరవుతోంది రష్మిక మందన్న. కాజల్ అగర్వాల్ గతంలో ఇలాగే చేసి తన కెరీర్‌ని ఎలా మార్చుకుందో అందరికీ తెలిసిందే.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts