Wednesday, September 18, 2024
HomeCinemaMahesh Babu : మహేష్ రాజమౌళి సినిమాలో విలన్ గా టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరంటే..

Mahesh Babu : మహేష్ రాజమౌళి సినిమాలో విలన్ గా టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరంటే..

Mahesh Babu : ప్రస్తుతం టాలీవుడ్ నుండి రాబోయే చిత్రాలు బోలెడన్ని ఉన్నాయి. కానీ దర్శకుడు రాజమౌళి మరియు సూపర్ స్టార్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయినప్పటి నుండి ఈ సినిమా కోసం ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. రాజమౌళి తన కెరీర్ లో తీసిన అన్ని సినిమాలు బారి విజయం సాధించాయి. ఇక ఆయన తీసిన బాహుబలి సినిమా తో తెలుగు ఇండస్ట్రీ సత్తా ( Ravi Teja Villain in Mahesh Movie ) ఇండియా మొత్తం చాటాడు. అంతటితో ఆగకుండా ఆర్ఆర్ఆర్ సినిమా తో ఏకంగా ప్రాంచానికి మన ఇండియన్ సినిమా ర్యాంజ్ చూపించాడు.

ravi-teja-as-villain-in-mahesh-babu-rajamouli-upcoming-cinema

రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ఆస్కార్ వరకు వెళ్లి మొట్ట మొదటిసారి మన ఇంస్ట్రీకి ఆస్కార్ అవార్డును తీసుకొచ్చింది. ఈ సినిమా తో ప్రపంచం మొత్తం ఫేమస్ అయ్యారు రాజమౌళి, రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్. అయితే ఇప్పుడు రాజామౌళి ప్రస్తుతం మహేష్ తో చేసే సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టారు. ఈ సినిమా స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు ఆ మధ్యలో ఈ సినిమా స్టోరీ రెడీ అయిపొయింది అని మీడియా ముందు చెప్పారు. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు సెట్స్ కు వెళుతుంది అని ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు తెలుగు సినిమా ప్రజలు.

ravi-teja-as-villain-in-mahesh-rajamouli-upcoming-cinema

మహేష్ మరియు రాజమౌళి మొట్ట మొదటి సారి కలిసి సినిమా చేస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో సెన్సషనల్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతుంది. గుంటూరు కారం సినిమా ప్రెకషకుల ముందుకు సంక్రాతి పండగకు వస్తుంది. ఇకపోతే మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాక రాజమౌళి తో చేసే సినిమాలో పలుగొంటారట. అయితే ఇటీవల ఈ ప్రాజెక్ట్ గురించి ఓ వార్త నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది.

ravi-teja-as-villain-in-mahesh-babu-rajamouli-cinema

అదేంటంటే, మహేష్ బాబు రాజమౌళి సినిమాలో విలన్ గా టాలీవుడ్ స్టార్ హీరో ను పెట్టబోతున్నారట. అవును మీరు వినేది నిజమే. రాజమౌళి సినిమాలలో హీరో ఎంత పవర్ ఫుల్ గా ఉంటాడో విలన్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటాడు. అందువలన ( Ravi Teja Villain in Mahesh Movie ) ఆ స్టార్ హీరో ను విలన్ గా పెట్టారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే, మాస్ మహారాజ రవితేజ. ఈ వార్తా మీద అధికారిక ప్రకటన లేదు కానీ ఈ విషయం నిజం అని తెలవాలంటే ఏదో ఒక అధికారిక ప్రకటన విడుదల చేయాలి చిత్ర యూనిట్.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts