Home Cinema Ravi Teja: సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న మాస్ మహారాజ రవితేజ.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Ravi Teja: సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న మాస్ మహారాజ రవితేజ.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Ravi Teja Quits Movies: మాస్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పర్చుకున్న హీరోలలో ఒకరు మాస్ మహారాజా రవితేజ. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన, చిన్న చిన్న పాత్రలు పోషించుకుంటూ, మెల్లగా హీరోగా మారి ఆ తర్వాత హిట్టు మీద హిట్టు కొట్టి ఇండస్ట్రీ లో నేడు ఒక స్టార్ హీరోగా స్థిరపడ్డాడు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. రవితేజ లో ఉన్న ప్రత్యేకమైన క్వాలిటీ ఏమిటంటే, అసలు కంటెంట్ లేని సన్నివేశానికి కూడా బలం తీసుకొని రాగలదు. ఆడియన్స్ ఆయన సినిమాలు ఎలా ఉన్న ఒక్కాసారి చూడొచ్చు అనే విధంగా చేస్తాడు.

ravi-teja-quits-movies

అందుకే రవితేజ సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు వస్తుంటాయి. రీసెంట్ గానే ఆయన వంద కోట్ల గ్రాస్ కొల్లగొట్టిన హీరోస్ లిస్ట్ లోకి చేరాడు. ఇక పోతే రవితేజ గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అదేమిటంటే రవితేజ త్వరలోనే నటనకి పూర్తి స్థాయిలో గుడ్ బై చెప్పి, దర్శకత్వం వైపు అడుగులు వెయ్యబోతున్నాడు అట. గతం లో కూడా ఆయన అనేకసార్లు ఈ విషయం గురించి చెప్పుకొచ్చాడు. తనకి దర్శకత్వం వహించాలని ఎప్పటి నుండో కోరిక ఉందని, ఎదో ఒక రోజు కచ్చితంగా మెగా ఫోన్ పట్టుకుంటాను అని, ఆరోజు నటనకి పూర్తి స్థాయిలో గుడ్ బై చెప్పేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

దానికి తగ్గట్టుగానే ఇప్పుడు రవితేజ అడుగులు వేస్తున్నాడు. ముందుగా తన కొడుకు మహాదన్ ని సినిమాల్లోకి హీరో గా పరిచయం చేసి, ఆ తర్వాత ఆయన దర్శకత్వం వైపు అడుగులు వేస్తాడని తెలుస్తుంది(Ravi Teja Quits Movies). మహాదన్ మొదటి సినిమాకి రవితేజ నే దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. హీరో కాకముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించిన రవితేజ కి దర్శకత్వ ప్రతిభ చాలానే ఉంది. కానీ ఇన్ని రోజు యాక్టర్ గా బిజీ అవ్వడం తో ఆయన ఆ వైపు పోలేదు. ఇప్పుడు కూడా యాక్టర్ గా బిజీ నే, కానీ ఆయనకి ఇప్పుడు దర్శకత్వం వైపు వెళ్లాలని కోరిక పుట్టింది.

ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వర రావు’ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న రవితేజ ఈ చిత్రం తర్వాత గోపీచంద్ మలినేని తో ఒక సినిమా, హరీష్ శంకర్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఈ సినిమాల తర్వాత ఆయన దర్శకత్వం వైపు వెళ్లే ఛాన్స్ ఉంది. చూడాలి మరి రవి తేజ హీరో గానే కొనసాగుతాడో లేదా డైరెక్టర్ గా కొత్త అవతారం ఎత్తుతాడో వేచి చూడాలి. ఫాన్స్ మాత్రం హీరోగానే ఉండాలి అని కోరుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి..?

Exit mobile version