Home Cinema RRR : మరోసారి ఆస్కార్ స్టేజిపై సత్తా చాటుకున్న ఆర్ఆర్ఆర్.. ప్రతి తెలుగు వాడు గర్విస్తాడు..

RRR : మరోసారి ఆస్కార్ స్టేజిపై సత్తా చాటుకున్న ఆర్ఆర్ఆర్.. ప్రతి తెలుగు వాడు గర్విస్తాడు..

దర్శక దిగజం ఎస్.ఎస్ రాజమౌళి తెరక్కేకించిన చిత్రం ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఈ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా అందరు అనుకున్నట్లే బారి విజయం సాధించింది. రాజమౌళి తన ప్రతి సినిమాతో ఓ మెట్టు ఎక్కుతున్నారు. ఆయన తన కెరీర్ లో తీసిన ప్రతి సినిమాతో హిట్ కొట్టి సౌత్ ఫిలిం ఇండస్ట్రీలోనే స్టార్ దర్శకుడిగా మర్యాదను సంపాదించుకున్నాడు.

rrr-fever-at-oscar-stage-once-again-at-96-acadmey-awards-held-in-usa

ఇలాంటి జక్కన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండియా లెవెల్ లోనే కాకుండా ప్రాంచవ్యాప్తంగా తన సత్తా చాటుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాను ఆస్కార్ వరకు తీసుకుపోయి, గెలిచి భారత దేశానికి తీసుకవచిన ఘనత ఆయనదే. ఇది తెలుగు ప్రజలకే కాదు యావత్ భారతదేశ సినిమా ప్రజలు గర్వించదగ్గ మూమెంట్. అయితే ఇటీవల అమెరికాలో ఆస్కార్ 96వ అకాడమీ అవార్డ్స్ చాలా గ్రాండ్ గా జరిగాయి. ఈ వేడుకలలో మరోసారి మన ఆర్ఆర్ఆర్ సినిమా విజువల్స్ పడ్డాయి.

ఈ సినిమాలోని ఆక్షన్ సిక్యూన్స్ లను మరోసారి గుర్తు చేసుకున్నారు అకాడమీ అవార్డ్స్. దీనికి స్పందిస్తూ చిత్ర బృందం ట్విట్టర్ వేడుకగా ఈ పర్ఫెక్ట్ మూమెంట్ పై స్పందించింది. తమ పనిని మరోసారి గుర్తు చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇలా అకాడమీ అవార్డ్స్ లో మన తెలుగు సినిమాను పొగుడుతుంటే ఆ ఫీల్ బలే ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు తెలుగు ప్రజలు. జక్కన ప్రస్తుతం మహేష్ బాబుతో చేయబోయే సినిమా పనులలో బిజీగా ఉన్నారు.

Exit mobile version