Home Cinema Sai Dharam Tej : ఆ హీరోయిన్ తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన సాయి...

Sai Dharam Tej : ఆ హీరోయిన్ తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ.. ఏమన్నాడంటే..

Sai Dharam Tej : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా సాయిధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా పెళ్లి చేసుకోబోతున్నారని, జవాన్ సమయంలో ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రూమర్ల నేపథ్యంలో ఎంత మంది వ్యాఖ్యానించినా ఆ వార్త ఆగడం లేదు. తాజాగా ఈ వార్తలపై మెగా హీరో సాయి ధరమ్ తేజ క్లారిటీ ఇచ్చాడు.

తాజాగా ‘ఉషాపరిణయం’ సినిమా ఈవెంట్‌కి హాజరైన సాయి ధరమ్ తేజ్ తన పెళ్లి గురించి మాట్లాడారు. కాగా, గత కొద్ది రోజులుగా నేను ఓ హీరోయిన్‌ని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నేను కూడా ఈ వార్తలను చూస్తున్నాను, అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. నేను ప్రస్తుతం చాలా మెరుగైన సోలో జీవితాన్ని గడుపుతున్నాను. ఇప్పుడు నాకు పెళ్లి ఆలోచన లేదు. ఇలా ఒంటరిగా ఇంకొన్ని రోజులు గడపాలని ఆశ.

sai-dharam-tej-gave-clarity-on-his-marriage-with-heroine

ఇంకా పొడిగిస్తూ ఆయన తను చేసుకోబోయే అమ్మాయికి ఎలాంటి లక్షణాలు ఉండాలో కూడా తెలిపాడు. నేను పెళ్లి చేసుకునే అమ్మాయి ముందుగా మా అమ్మకు నచ్చాలి మరియు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. నేను పెళ్లి చేసుకునే అమ్మాయికి ఈ రెండు లక్షణాలు ఉండాలని సాయి ధరమ్ తేజ్ స్పష్టం చేశాడు. ఇక విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఉషాపరిణయం సినిమా ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన సాయిధరమ్ తేజ్ ఈ విషయాన్నీ అభిమానులతో పంచుకున్నాడు.

Exit mobile version