Friday, November 22, 2024
HomeCinemaMega Family : మెగా ఫ్యామిలీ లో మొదలైన వివాదాలు.. కారణం ఇదేనా..

Mega Family : మెగా ఫ్యామిలీ లో మొదలైన వివాదాలు.. కారణం ఇదేనా..

Mega Family : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికల తర్వాత మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు స్టార్ లు వార్తల్లో నిలిచారు. వారిలో ఒకరు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాగా మరొకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దశాబ్ద కాలం కష్టం తర్వాత జనసేన పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే గా గెలిచాడు. జనసేన ఈసారి ఎన్నికలలో 21 సీట్లలో నిలబడి అన్ని స్థానాలలో విజయం సాధించింది. ఆయన సక్సెస్‌తో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది వారి పదేళ్ల కల.

ఇక ఈ ఎన్నికలలో అల్లు అర్జున్ ప్రవర్తన అత్యంత వివాదాస్పద అంశంగా మారింది. అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ గతంలో లాగా కలిసి లేరనే చెప్పుకోవాలి. వీరి మధ్య కోల్డ్ వార్ ఎప్పటినుండో నడుస్తుంది. దీనికి కారణం బన్నీ వైఖరి అనడంలో ఎలాంటి సందేహమే లేదు. ప్రధానంగా గతంలో ఓ సినిమా ఫంక్షన్ లో చెప్పను బ్రదర్ అంటూ వార్తల్లో నిలిచారు. దీని తరువాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలలో మెగా ఫ్యామిలీకి భిన్నంగా అల్లు అర్జున్ తన స్నేహితుడు అయినా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా భార్యతో కలిసి వచ్చారు.

sai-dharam-tej-unfollowed-allu-arjun-and-sneha-reddy-on-instagram-for-this-reason

రవి గెలుపుకు సహకరించాలని తన అభిమానులను ప్రోత్సహించారు. ఇది తెలుగు చిత్రసీమలోనూ, రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సొంత మామ కష్టాలు అనుభవిస్తున్న వేళ, తన స్నేహితుడి వద్దకు వచ్చి పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి వైఎస్ పార్టీకి ఓటు వేయమని కోరాడు. దీనిపై మెగా, జనసేన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదిలా ఉంటే, ఇటీవల సాయిధరమ్ తేజ్ స్నేహారెడ్డితో పాటు అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసాడు. ఈ వార్త వైరల్ గా మారింది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts