Sai Pallavi: సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోనే నటన పరంగా తిరుగులేదు అని అనిపించుకున్న అతి తక్కువ మంది స్టార్ హీరోయిన్స్ లో ఒకరు సాయి పల్లవి. ‘ఫిదా’ సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయమైనా సాయి పల్లవి (Sai Pallavi In Love), ఆ సినిమా గ్రాండ్ హిట్ అవ్వడం తో ఈమె ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా తర్వాత ఆమె నటించిన ప్రతీ సినిమాలోనూ తన అద్భుతమైన నటనతో ప్రేక్షాభిమానం పొందుతూ లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. అంటే పవన్ కళ్యాణ్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో, హీరోయిన్స్ లో సాయి పల్లవి కి ఆ రేంజ్ ఫాలోయింగ్ అన్నమాట.
ఇతర హీరోయిన్స్ లాగా అందాల ఆరబోతలు చెయ్యడం, ముద్దు సన్నివేశాల్లో నటించడం వంటివి సాయి పల్లవి అసలు చెయ్యదు, అయ్యినప్పటికీ కూడా ఆమెకి ఈ రేంజ్ క్రేజ్ అంటే అందుకు కారణం ఆమె టాలెంట్ అనే చెప్పాలి. వరుస హిట్స్ తో దూసుకుపోయే సాయి పల్లవి కి, ఈ మధ్య కాలం లో వరుసగా డిజాస్టర్ సినిమాలు వచ్చాయి. డిజాస్టర్స్ వచ్చాయి కదా అని ఆమె మార్కెట్ ఏమి తగ్గిపోలేదు. ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి, స్టార్ హీరోల సరసన రీసెంట్ గా అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ఆమె మనసుకి నచ్చకపోవడం తో ఆ సినిమాల్లో నటించడానికి ఒప్పుకోలేదు.
విరాట పర్వం, గార్గి చిత్రాల విడుదల తర్వాత సాయి పల్లవి(Sai Pallavi In Love) ప్రస్తుతం ప్రముఖ తమిళ హీరో శివ కార్తికేయన్ తో కలిసి ఒక సినిమా చేస్తుంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక పోతే గత ఏడాది ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘గార్గి’ చిత్రం విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది, కానీ కమర్షియల్ గా మాత్రం ఈ చిత్రం యావరేజి గా మిగిలింది. ఈ సినిమా విడుదలై సరిగ్గా ఏడాది సమయం పూర్తి అవ్వడం తో సోషల్ మీడియా లో ఆమె ఒక పోస్టు పెట్టింది.
గార్గి చిత్రం విడుదలై ఏడాది అయ్యింది, నేను చేసిన సినిమాలలో ఎంతో ప్రేమించి పోషించిన పాత్ర ఇది. ఇలాంటి అద్భుతమైన సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకు గాను డైరెక్టర్ గౌతమ్ కి కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ఆమె పెట్టిన ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. సాయి పల్లవి ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తుంది, ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి టైం కి రిలీజ్ కు సిద్ధంగా ఉంది.