Home Cinema Sai Pallavi : పాపతో షూటింగ్ సెట్ లో సాయి పల్లవి.. ఫొటోస్ వైరల్..

Sai Pallavi : పాపతో షూటింగ్ సెట్ లో సాయి పల్లవి.. ఫొటోస్ వైరల్..

ప్రేమమ్ సినిమా తో ఇండస్ట్రీ కి పరిచయం అయింది సాయి పల్లవి. తన సొంత స్టైల్ తో, అదిరిపోయే డాన్స్ తో మంచి ఫ్యాన్ బేస్ సృష్టించుకుంది. హీరో వరుణ్ తేజ్ తో ఫిదా మూవీ తో తెలుగు ప్రేక్షకులకు దెగ్గర అయింది. ఆ సినిమాలో తన డాన్స్ చూసి అందరూ నిజంగానే ఫిదా ఐపోయారు. హీరోయిన్ కి అందం ముఖ్యం కాదు నటన మరియు డాన్స్ ముఖ్యం అని నిరూపించిన నటి సాయి పల్లవి.

ఆ తరువాత నానితో ఎంసీఏ, నాగ చైతన్యతో లవ్ స్టోరీ వంటి సినిమాల్లో నటించి మంచి సక్సెస్ అందుకుంది సాయి పల్లవి. ప్రస్తుతం తిను చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న తండేల్ అనే సినిమాలో నాగ చైతన్యతో కలిసి నటిస్తుంది. ఈ సినిమా ని 2 పిక్చర్స్ బన్నీ వాసు మరియు గీత ఆర్ట్స్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ సినిమా లో నాగ చైతన్య ఒక మత్స్యకారుడు.

sai-pallavi

గీత ఆర్ట్స్ లేటెస్ట్ గా వారి సోషల్ మీడియా లో షూటింగ్ కి సంబందించిన కొన్ని ఫోటోలు ఎక్స్(ట్విట్టర్) లో షేర్ చేశారు. ఆ ఫొటోలో సాయి పల్లవి ఒక పాపని ఎత్తుకుని కనిపించింది. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. కొందరు ఏమో సాయి పల్లవికి అప్పుడే ఏళ్ళయిందా ? మరికొందరు ఏమో పాపా క్యూట్ గా ఉంది ఎవరు తను ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version