Home Cinema Samantha: విడాకులకు నిజమైన కారణం వెల్లడించిన సమంత.. ఇన్నాళ్లకు కారణం తెలిసింది..

Samantha: విడాకులకు నిజమైన కారణం వెల్లడించిన సమంత.. ఇన్నాళ్లకు కారణం తెలిసింది..

Samantha Reveals Divorce Reason: సినిమాల్లో నటించే హీరోలు హీరోయిన్లు నిజ జీవితం లో కూడా ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం అనేది కొత్తేమి కాదు. దశాబ్దాల నుండి ఇది జరుగుతూనే ఉంది, ఒకే చోట పని చేసేవాళ్లకు ఇది సహజం. కానీ పెళ్ళైన తర్వాత ఆ బంధాన్ని నిలబెట్టుకోవడం మాత్రం చాలా కష్టమైన పని. ఈమధ్య కాలం లో అయితే విడాకులు తీసుకోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా సమంత మరియు నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరినీ చూస్తే ఒకరికోసం ఒకరు పుట్టినట్టుగా అనిపిస్తాది.

naga-chaitanya-samantha-divorce-real-reason

ఒక నాలుగేళ్లు ఇద్దరు కలిసి ఎంతో అన్యోయంగా ఉన్నప్పటికీ కొన్ని అనుకోని కారణాల వల్ల విబేధాలు వచ్చి రెండేళ్ల క్రితం విడిపోయారు. వీళ్లిద్దరు విడిపోయినప్పటికీ కూడా వీళ్ళ గురించి సోషల్ మీడియా లో తరచూ ఎదో ఒక వార్త ప్రచారం అవుతూనే ఉంటుంది(Samantha Reveals Divorce Reason). మాకు పెళ్లి అయ్యింది, ఆ తర్వాత విడాకులు తీసుకున్నాము అనే విషయాన్నీ వీళ్ళిద్దరూ మర్చిపోయినా సోషల్ మీడియా మాత్రం మర్చిపోలేదు. రీసెంట్ సమంత కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే సమంత కి నాగ చైతన్య అమ్మ అంటే ఎంతో ఇష్టమట.

ఇప్పటికీ ఆమెతో మంచిగానే మాట్లాడుతూ ఉంటుందని టాక్. అయితే ఒకరోజు అమెరికా కి వెళ్లి ఆమెని కలిసినప్పుడు విడాకులు తీసుకోవడానికి గల కారణాలను చెప్పి బోరుమని ఏడ్చేసింది అట(Samantha Reveals Divorce Reason). అత్తారింట్లో స్వేచ్ఛ లేకుండా పోయిందని, ఆ ఇంట్లో ఉన్న మనుషులు ఒక్కోసారి ఒక్కోలాగా ప్రవర్తిస్తుంటారని, అంత వింత మనుషులను ఎక్కడా చూడలేదు అంటూ చెప్పుకొచ్చిందట. ముఖ్యంగా అమల పెట్టే కండిషన్స్ తన స్వేచ్చకీ ఎంతో భంగం కలిగించింది అంటూ చెప్పుకొచ్చింది. ఎవరు ఏమి అనుకున్నా చైతూ నన్ను అర్థం చేసుకుంటే చాలు అనుకునేదానిని.

కానీ చైతు కూడా ప్రభావితమై, తనకి అన్నీ విషయాల్లో ఆంక్షలు పెట్టడం ప్రారంభించాడని, సినిమాలు వదిలేయమని ఒత్తిడి చేసాడు అంటూ చెప్పిందట. అతనికి నచ్చచెప్పడానికి ఎంతో ప్రయత్నం చేశాను, కానీ అతను ఒప్పుకోలేదు, దాని వల్ల రోజు గొడవలు అయ్యేవి, అందుకే ఇక కొనసాగడం కష్టం అని అర్థం అయ్యాకనే విడాకులు ఇచ్చేసాను అంటూ చెప్పిందట. ఈ విషయాలన్నీ చెప్పుకొని ఆమె బోరుమని ఏడ్చిందట. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం.

సమంత నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1 న రిలీజ్ అవ్వబోతుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ఇద్దరు నటులకు చాల ముఖ్య మైన సినిమా ఎందుకంటే గత 2-3 సినిమాలు ఈ ఇద్దరు నటులవి అంత మంచిగా ఆడలేదు. వీళ్లిద్దరు ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నారు.

Exit mobile version