Samantha: రూమర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే స్టార్ హీరోయిన్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో సమంత పేరు ముందు వరుసలో ఉంటుంది. ఈమె మీద వచ్చినన్ని రూమర్స్ ఇండియా లో ఏ హీరోయిన్ మీద కానీ, హీరో మీద కానీ వచ్చి ఉండదు. ముఖ్యంగా ఈమె నాగ చైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే ఒక పెద్ద సెన్సేషనల్ టాపిక్,ఇక ఆ తర్వాత వీళ్లిద్దరు విడిపోవడం అనేది మరో సెన్సేషనల్ టాపిక్(Samantha Gautham Menon). విడిపోయిన రోజు నుండి నేటి వరకు ప్రతీరోజు ఈమె గురించి సోషల్ మీడియా లో ఎదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. ప్రారంభం లో ఆ రూమర్స్ కి బాగా హర్ట్ అయిపోయిన సమంత ఆ తర్వాత పట్టించుకోవడం మానేసింది.
కానీ సున్నితమైన విషయాల్లో విమర్శలు ఎదురుకున్నప్పుడు మాత్రం రెస్పాన్స్ ఇచ్చి క్లారిటీ ఇచ్చేది. ఇది ఇలా ఉండగా ఆమె గురించి సోషల్ మీడియా లో ఎవరికీ తెలియని ఒక వార్త హల్చల్ చేస్తుంది. అదేమిటంటే ఈమెకి ఇంత గొప్ప కెరీర్ రావడానికి కారణం గౌతమ్ వాసుదేవ్ మీనన్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఆయన తెరకెక్కించిన ‘ఏం మాయ చేసావే’ అనే చిత్రం ద్వారానే ఈమె హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే. కేవలం బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు, టాలీవుడ్ హిస్టరీ లో కల్ట్ క్లాసిక్ స్టేటస్ ని తెచ్చుకున్న లవ్ స్టోరీస్ లో ఒకటిగా ఈ చిత్రం నిల్చింది.
ఈ సినిమా తర్వాత సమంత గౌతమ్ మీనన్(Samantha Gautham Menon) తెరకెక్కించిన రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే సమంత మరియు గౌతమ్ మీనన్ కి మధ్య అప్పట్లో ఒక ఎఫైర్ నడిచిందని, వీళ్లిద్దరు చెన్నైలోని ఒక హోటల్ రూమ్ లో ఉంటుండగా గౌతమ్ మీనన్ భార్య పసిగట్టి సమంత ని చెంప దెబ్బ కొట్టిందని అప్పట్లో కోలీవుడ్ వర్గాల్లో ఒక వార్త కోడై కూసింది. అయితే ఈ వార్త పై అటు సమంత కానీ, గౌతమ్ మీనన్ కానీ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోవడం వల్ల, అందరూ ఇదే నిజం అని అనుకుంటూ ఉన్నారు. ఇకపోతే సమంత హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఖుషి’ సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల అయ్యేందుకు సిద్ధం గా ఉంది.
సమంత విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ సినిమా మొన్ననే ఒక మ్యూజికల్ ఈవెంట్ చేసారు సినిమా బృందం. ఈ ఈవెంట్ లో సమంత విజయ్ రెచ్చిపోయారు అనే చెప్పాలి. విజయ్ చొక్కా విప్పేసి సమంతను ఎత్తుకుని ఒక రేంజ్ లో డాన్స్ చేసాడు. ఈ సీన్ చూసి నెటిజనులు ఇది మ్యూజికల్ ఈవెంట్ ఆ లేదా ప్రీ వెడ్డింగ్ షూట్ అని రచ్చ రచ్చ చేస్తున్నారు. పాపం నాగ చైతన్య ఆ వీడియో చూసి ఎలా తట్టుకుంటున్నాడో ఏమో మరి.