Samantha: గతకొంత కాలం నుండి ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ఏమి చేసినా, ఏమి మాట్లాడిన అది సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయిపోతుంది. నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న దగ్గర నుండి ఆమె ఎక్కువగా ఫోకస్ అవుతూ వచ్చింది. ప్రతీ రోజు ఈమె గురించి సోషల్ మీడియా లో ఎదో ఒక కథనం ప్రచారం అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఈమె ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసే ఫోటోలు తెగ వైరల్ అవుతుంటాయి(Samantha New York). ఒకప్పుడు అయినా పెళ్ళైన అమ్మాయి లాగా కొన్ని లిమిట్స్ పెట్టుకొని ఉండేది. కానీ ఎప్పుడైతే నాగచైతన్య తో విడాకులు తీసుకుందో, అప్పటి నుండి ఆమె తీరు మొత్తం మారిపోయింది.
పూర్తిగా స్వేచ్ఛ దొరికిన అమ్మాయిలాగా ప్రవర్తిస్తూ, ఇష్టమొచ్చిన దుస్తులను ధరించి ఎల్లప్పుడూ చర్చల్లో నిలుస్తుంది సమంత. ఈమె అప్లోడ్ చేసే ఫోటోలకు సోషల్ మీడియా లో నిమిషాల వ్యవధి లోనే లక్షల సంఖ్యలో లైక్స్ మరియు కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఇకపోతే రీసెంట్ గా ఈమె తనకి సోకినా మయోసిటిస్ వ్యాధి కి చిట్టచివరి ట్రీట్మెంట్ కోసం అమెరికా కి వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే(Samantha New York). అక్కడ ఆమె చికిత్స చేయించుకునే పేషెంట్ లాగ కనిపించడం లేదు, ఇష్టమొచ్చినట్టు అమెరికా నగర వీధుల్లో ఫోటో షూట్స్ చేస్తూ, కాలం గడిపేస్తుంది. రీసెంట్ గా ఆమె చీర కట్టులో దిగిన ఫోటో షూట్ సోషల్ మీడియా లో ఆమె పై నెగటివిటీ పెంచేలా చేస్తుంది.
ఇది చీర కట్టులాగా ఉందా ? భారత స్త్రీ ఇలాగేనా చీర కట్టుకునేది ? యద అందాలను చూపిస్తూ లోపల ఏ కలర్ ఇన్నర్ వేర్ వేసుకుందో కూడా తెలిసిపోతుంది. చీర కట్టుకునే పద్దతి ఇదేనా ? ఇలాంటి పిచ్చి ఫోటో షూట్స్ ఇండియా లో ఎలాగో చేస్తావు, అమెరికా నగర వీధుల్లో కూడా మన ఇండియన్స్ పరువు తియ్యాలని అనుకుంటున్నావా? అంటూ నెటిజెన్స్ ఇంస్టాగ్రామ్ లో కామెంట్ చేస్తున్నారు. సమంత పై ఇలాంటి నెగటివిటీ ఉండడం సర్వ సాధారణమే. ఇకపోతే ఆమె లేటెస్ట్ గా హీరోయిన్ గా నటించిన ‘ఖుషి’ చిత్రం వచ్చే నెల 1 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.
చాలా కాలం తర్వాత ఆమె హీరో పక్కన హీరోయిన్ గా చేసిన సినిమాగా ఖుషి నిలవబోతుంది. ఈమధ్య సమంత ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ రోల్స్ మరియు విలన్ రోల్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే సమంత విజయ్ జంట అదిరింది అని ఫాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. మొన్న జరిగిన మ్యూజికల్ ఈవెంట్ తరువాత్త, సమంత విజయ్ ప్రేమలో ఉన్నారు అని ఎన్నో వార్తలు వచ్చాయి.
దానికి కారణం వీరు ఆ మ్యూజికల్ ఈవెంట్ లో చేసిన పనులు, వీళ్లిద్దరు ఎంతో రొమాంటిక్ గ చేసిన డాన్స్ చూసి మీడియా తో సహా ఫాన్స్ కూడా షాకై షేక్ అయ్యారు. ఈ సినిమా హిట్ ఐతే మాత్రం వీళ్ళిద్దరిని ఇంక ఎవ్వరు పట్టుకోలేరు.