Home Cinema ప్రభాస్ సినిమాలో హీరోయిన్ అవకాశం కొట్టేసిన సమంత.. ఏ సినిమా అంటే..

ప్రభాస్ సినిమాలో హీరోయిన్ అవకాశం కొట్టేసిన సమంత.. ఏ సినిమా అంటే..

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఈ పేరు తెలుగు ప్రేక్షకులకే కాదు, మొత్తం భారతీయులకి చాలా సుపరిచితం. కృష్ణంరాజు గారి వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఈశ్వర్ సినిమాతో అరంగేట్రం చేసాడు ప్రభాస్. ఆ తరువాత అడవి రాముడు, వర్షం వంటి ఎన్నో సినిమాలు చేసి తనను తాను నిరూపించుకున్నాడు. ఇక రాజమౌళి తో 5 ఏళ్ళు కష్ట పడి చేసిన బాహుబలి సినిమా ప్రభాస్ ని తెలుగు నుంచి ఇండియా మొత్తం తెలిసేలా చేసింది.

prabhas

ప్రస్తుతం ప్రభాస్ కి సంబందించిన ఒక సినిమా గురించి వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. సమంతకు విడాకుల తరువాత పెద్దగా కలిసి రాలేదు, ఒక మంచి సినిమా కూడా చేయలేదు అంతే కాకుండా మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది సమంత. ఇక మధ్యలో 1 ఏడాది సినిమాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టింది. ప్రస్తుతం ఈ అమ్ముడు ప్రభాస్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నట్టు సమాచారం.

ప్రభాస్ సమంత ఇప్పటి వరకు ఎప్పుడు కలిసి నటించలేదు. కానీ ఇక అభిమానులకి ఆ కోరిక తీరబోతుంది. అటు ప్రభాస్ అభిమానులు, ఇటు సమంత అభిమానులు ఈ వార్త విని తెగ సంబర పడిపోతున్నారు. వీరిద్దరి కొంబో అదిరిపోతోంది సినిమా పక్క హిట్ అంటూ అప్పుడే ప్రచారం చేస్తున్నారు. మరి అధికారిక ప్రకటం ఎపుడు రాబోతుందో వెచ్చి చూడాలి.

Exit mobile version