Friday, September 20, 2024
HomeCinemaSamantha Debts: ఆ హీరో దగ్గర కోట్ల రూపాయిలు అప్పు చేసిన సమంత.. అంత అవసరం...

Samantha Debts: ఆ హీరో దగ్గర కోట్ల రూపాయిలు అప్పు చేసిన సమంత.. అంత అవసరం ఏమొచ్చింది..?

Samantha Debts: సౌత్ ఇండియా లో టాప్ 3 స్టార్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా సమంత పేరు ఉంటుంది. చిన్న చిన్న షాపింగ్ మాల్ యాడ్స్ చేసుకుంటూ ఆ తర్వాత హీరోయిన్ అవకాశాలను సంపాదించిన సమంత , తన జీవితం లో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని నేడు ఈ స్థాయిలో ఉంది. ఎలాంటి పరిస్థితిని అయినా తట్టుకోగలను అని ఆమె ఎన్నోసార్లు నిరూపించుకుంది కూడా. అందుకే సమంత ని ఒక మనిషిగా అందరూ అంతలా ఇష్టపడుతారు. నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత ఈమె మానసికంగా ఎంతో బాదపడినప్పటికీ కూడా, ఏమాత్రం ఆత్మాభిమానం కోల్పోకుండా నిలబడి ఆమె కెరీర్ లో బిజీ అయినా తీరు ఎంతో ప్రశంసనీయం.

samantha-debts

అంతే కాదు రీసెంట్ గానే ఈమెకి ‘మయోసిటిస్’ అనే అత్యంత ప్రాణాంతక వ్యాధి సోకిన సంగతి అందరికీ తెలిసిందే. ఈమె వ్యాధి నుండి ఆమె కోలుకొని ఈమధ్యనే వరుసగా సినిమాలు మరియు వెబ్ సిరీస్ షూటింగ్స్ తో బిజీ అయ్యింది. అయితే ఆమె చివరి ప్రాథమిక చికిత్స చేయించుకోవడానికి త్వరలోనే అమెరికా కి వెళ్లబోతుంది. ఆమె అక్కడికి వెళ్లబోయే ముందు కొన్ని రోజులు ప్రశాంతంగా జీవించడానికి తన స్నేహితురాలితో కలిసి బాలి ట్రిప్ కి వెళ్ళింది. అక్కడ ఈమె తన స్నేహితురాలితో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోలు, ఫోటోలు ఎప్పటికప్పుడు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేస్తూ ఉంటుంది సమంత.

samantha-took-money-from-that-hero

అవి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతూ ఉంటాయి. అదంతా పక్కన పెడితే సమంత త్వరలోనే అమెరికా లో చేయించుకోబోతున్న తుది సర్జరీ కి దాదాపుగా 25 కోట్ల రూపాయిలు ఖర్చు అవుతుందట . సమంత దగ్గర ఇప్పటికిప్పుడు అంత డబ్బు లెకపొయ్యేసరికి ఒక ప్రముఖ స్టార్ హీరో కి సంబంధించిన బెస్ట్ ఫ్రెండ్ ని అప్పు అడిగిందట(Samantha Debts). ఒక్కో సినిమాకి కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ సమంత కనీసం పాతిక కోట్ల రూపాయిలను కూడా దాచిపెట్టుకోలేక పోయిందా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

samantha

రీసెంట్ గానే ఆమెకి 250 కోట్ల రూపాయిల ఆస్తులు ఉన్నట్టు సోషల్ మీడియా లో ఒక ప్రచారం సాగింది. ఇంతలోపే ఆమె అప్పులు చేస్తుంది అని కూడా ప్రచారాలు సాగుతున్నాయి. ఈ రెండిట్లో ఏది నిజం, ఏది అబద్దం అనేది కనుక్కోలేకపోతున్నారు అభిమానులు. ఏది ఏమైనా సమంత పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో ఉంటే చాలు అని ఆమె అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. సమంత స్నేహితులతో ప్రస్తుతం బాలి దేశం లో ఎంజాయ్ చేస్తుంది. బాలి లో సమంత స్నేహితులతో చేసిన డాన్స్ ఇంస్టాగ్రామ్ లో చాల వైరల్ అయ్యింది. ఇప్పుడు రీల్స్ లో ఎక్కడ చుసిన అదే పాఠ అదే స్టెప్పులు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts