Samantha : సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ లో ఉండే పేరు సమంత. ‘ఏం మాయ చేసావే’ అనే సినిమాతో హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసిన, ఆ సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారింది. వరుసగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా అందరి స్టార్ హీరోల సరసన నటించి అనతి కాలం లోనే స్టార్ స్టేటస్ ని దక్కించుకుంది. కేవలం తెలుగు లో మాత్రమే కాదు, తమిళం లో కూడా ఈమెకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు(List Of Samantha Affairs). అక్కడ కూడా వరుసగా స్టార్ హీరోల సినిమాల్లోనే అవకాశాలు దక్కించుకుంది. అలా చూస్తూ ఉండగానే లేడీ సూపర్ స్టార్ రేంజ్ ని దక్కించుకుంది.
కేవలం హీరోయిన్ రోల్స్ కి మాత్రమే పరిమితం కాకుండా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మరియు విలన్ రోల్స్ కూడా చేసింది. ఇకపోతే సమంత నాగ చైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు కాపురం చేసి విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అంతకు ముందు ప్రముఖ హీరో సిద్దార్థ్ తో కూడా ప్రేమాయణం నడిపింది. పెళ్లి పీటల దాకా వెళ్లిన వీళ్లిద్దరి వ్యవహారం ఎందుకో చివరి నిమిషం లో బ్రేక్ అయ్యింది. ఇదంతా అందరికీ తెలిసిన విషయం. తెలియని విషయం ఏదైనా ఉందా అంటే, ఈ ఇద్దరి కంటే ముందు సమంత ఒక హీరో ని పిచ్చిగా ప్రేమించింది అట.
అతను మరెవరో కాదు, సూపర్ స్టార్ రజినీకాంత్(List Of Samantha Affairs). చిన్నప్పటి నుండి రజినీకాంత్ అంటే సమంత కి విపరీతమైన అభిమానం, ప్రేమ అట. ఇప్పటికీ ఆమె గదిలోకి వెళ్తే రూమ్ నిండా ఎక్కువగా రజినీకాంత్ ఫొటోలే కనిపిస్తాయట. ఆ రేంజ్ పిచ్చి ప్రేమ రజిని మీద ఉండేది అట. ఈ విషయాన్నీ స్వయంగా సమంతానే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. తమిళం లో రజినీకాంత్ అంటే ఎంత పిచ్చి ఇష్టమో, తెలుగు లో పవన్ కళ్యాణ్ అంటే ఆమెకి అంత పిచ్చి ఇష్టమట. ఇదంతా పక్కన పెడితే మయోసిటిస్ ని తాత్కాలికంగా కోలుకున్న సమంత, విజయ్ దేవరకొండ తో కలిసి ‘ఖుషి’ చిత్రాన్ని పూర్తి చేసిన సంగతి తెలిసిందే.
రీసెంట్ గానే విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది, కానీ ఓవర్సీస్ లో మాత్రం భారీ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆమె మయోసిటిస్ ప్రధాన చికిత్స కోసం న్యూయార్క్ కి వెళ్ళింది. సమంత ప్రస్తుతం తన ఖుషి సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది. అమెరికా నుండి తిరిగివచ్చిన సమంత మల్లి సినిమాలు చేయటం ప్రారంబించ బోతుంది.
ఇక నాగ చైతన్య విషయానికి వస్తే చైతు ప్రస్తుతం మంచి కధల కోసం వేచి చూస్తున్నాడు. కొత్త డైరెక్టర్ అయినా పర్లేదు కానీ మంచి కథ ఉండాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. తన దెగ్గరికి ఎన్నో కధలు వచ్చిన రిజెక్ట్ చేసాడు అంట స్టోరీ నచ్చక.