Monday, November 25, 2024
HomeCinemaSamantha: డైరెక్టర్లకి కాల్ చేసి ఆ హీరో కి అవకాశం ఇవ్వమని కోరుతున్న సమంత.. ఎవరా...

Samantha: డైరెక్టర్లకి కాల్ చేసి ఆ హీరో కి అవకాశం ఇవ్వమని కోరుతున్న సమంత.. ఎవరా హీరో..?

Samantha: టాలీవుడ్ లో ఉన్న తో హీరోయిన్ అందరిలో సమంత ఒకరు. తినకు ఉన్న ఫ్యాన్ బేస్ మరేఇతర హీరోయిన్ లకు ఉండరు, ఎంతో మంది టాప్ హీరోలతో, డైరెక్టర్ లతో పని చేసిన సమంత కెరీర్ ఒకానొక సమయంలో ఒక వెలుగు వెలిగింది. చైతూతో విడాకుల తరువాత సమంతకు పెద్దగా కలిసి రాలేదు. నాగ చైతన్య సమంత ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న 4 ఏళ్లకే అనుకోని కారణాల వాళ్ళ ఇద్దరు విడాకులు తీసుకున్నారు(Samantha Siddharth). విడాకులకు ముందు ఇద్దరి సినీ కెరీర్ అద్భుతంగా ఉంది, విడాకులు తీసుకున్న తరువాత ఇద్దరికి ఓకే మంచి హిట్ సినిమా కూడా లేదు.

siddharth-samantha-nga-chaitanya

పుష్ప లో సమంత చేసిన ఐటెం సాంగ్ కి విపరీతంగా క్రేజ్ వచ్చినప్పటికీ అది ఎక్కువ కాలం కొనసాగలేదు. తాను చేసిన యశోద, శాకుంతలం ప్రొడ్యూసర్ లకి బారి నష్టాలు మిగిల్చాయి. విజయ్ దేవర కొండతో తను చేసిన ఖుషి సినిమా కూడా పెద్దగా ఏమి బాలేదు కానీ వారి అదృష్టం కలెక్షన్స్ మాత్రం బానే వచ్చాయి. ఇపుడు సమంత గురించి ఒక వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది, అదేంటి అంటే సమంత తనకు తెలిసిన ప్రతి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కి కాల్ చేసి ఈ హీరోతో సినిమా చేయండి అని సజెస్ట్ చేస్తుంది అంట.

hero-siddharth

ఇంతకీ ఆ హీరో ఎవరు అని మీరు అనుకుంటున్నారు.? నాగ చైతన్య అనుకుంటున్నారా..? కాదు ఆ హీరో ఎవరో తెలిస్తే మీరు చాల ఆశ్చర్యపోతారు. ఆ హీరో మరెవరో కాదు సిద్ధార్థ్(Samantha Siddharth). చెప్పనా ఆశ్చర్యపోతారు అని. సమంత సిద్ధార్థ్ మధ్య ఒకప్పుడు ప్రేమాయణం నడిచింది. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. కలిసి పూజలు చేసారు ఎక్కడ పడితే అక్కడ తిరిగారు. కానీ ఏమయిందో ఏమో కానీ వీరిద్దరూ విడిపోయారు, ఎవరి దారుల్లో వాల్లు వెళ్లిపోయారు. ఆ తరువాత సమంత నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది, వీరు విడిపోయినప్పుడు కూడా సిద్ధార్థ్ చాల నాటుగా స్పందించాడు.

samantha-hero-siddharth

సిద్ధార్థ్ నటించిన చిన్నా సినిమా ప్రస్తుతం థియేటర్ లలో ఆడుతుంది. ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది, సమంతకి కూడా ఈ సినిమా చూసి ఎంతగానో నచ్చింది. సిద్ధార్థ్ తో తనకున్న వైరాన్ని మర్చిపోయి ఎన్నో ఏళ్ళ తరువాత మొదటి సారి కాల్ చేసి మాట్లాడింది అంట సమంత. అంతే కాదు చిన్నా సినిమా డైరెక్టర్ అరుణ్ కుమార్ కి కూడా కాల్ చేసి చాల మంచి హీరో ని పెట్టారు సినిమాలో, చాల అద్భుతంగా ఉంది సినిమా అని చెప్పింది అంట.

ఇపుడు ఇండస్ట్రీ లో ఇదే హాట్ టాపిక్, మల్లి సమంత సిద్ధార్థ్ ల మధ్య ఏమైనా మొదలు అవుతుంది ఏమో ఫాన్స్ గుస గుసలాడుతున్నారు. కొందరు ఏమో సమంత సిద్ధార్థ్ కు సినిమా నచ్చి కాల్ చేసింది అని, మరి కొందరు ఏమో మల్లి ఫీలింగ్స్ వచ్చినట్టు ఉన్నాయి అని ట్వీట్ చేసి వారి అభిప్రాయం తెలియచేసారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts