Sunday, July 7, 2024
HomeCinemaSamantha-Raviteja: మిస్ ఐన రవితేజ సమంత కాంబో సినిమా.. పెద్ద ప్లాప్ నుండి తప్పించుకుంది..

Samantha-Raviteja: మిస్ ఐన రవితేజ సమంత కాంబో సినిమా.. పెద్ద ప్లాప్ నుండి తప్పించుకుంది..

Samantha-Raviteja: మాస్ మహారాజ రవితేజ టాలీవుడ్ లో దాదాపుగా ప్రతీ దర్శకుడితో మరియు ప్రతీ హీరోయిన్ తో కలిసి పనిచేసాడు. కానీ ఆయన దర్శకులలో ఇంకా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పని చెయ్యాల్సి ఉంది, అలాగే హీరోయిన్స్ లో సమంత మిగిలి ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రావాలని అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. కానీ ఎందుకో ఈ కాంబినేషన్ సెట్ అవ్వడం లేదు(Samantha Raviteja Combo). సమంత నాగ చైతన్య తో పెళ్ళికి ముందు అయితే ప్రతీ హీరో తో కలిసి నటించేది. కానీ పెళ్లి తర్వాత, ఆ తర్వాత ఆయనతో విడాకులు తర్వాత సమంత స్రిప్ట్ సెలక్షన్ తీరు మొత్తం మారిపోయింది.

raviteja-samantha-combo

ఎక్కువగా ఆమె ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ మరియు నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషిస్తూ వస్తుంది. ఇక రీసెంట్ గా ఆమె విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన ‘ఖుషి’ చిత్రం వచ్చే నెల 1వ తేదీన విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉండగా గతం లో రవితేజ మరియు సమంత కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి ఉందట(Samantha Raviteja Combo). ఆ సినిమా పేరు ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. రవితేజ మరియు శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్క్కిన ఈ సినిమా అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇలియానా నటించిన సంగతి అందరికీ తెలిసిందే.

ravi-teja-samantha

చాలా కాలం తర్వాత ఆమె టాలీవుడ్ లో చేసిన సినిమా ఇదే. అయితే ఈ చిత్రాన్ని సమంత తో చెయ్యడానికి తొలుత సంప్రదించారట. కానీ ఆమెకి ఈ కథ ఏమాత్రం నచ్చకపోవడం తో మొహమాటం లేకుండానే నో చెప్పిందట. ఈమె కెరీర్ లో మొట్టమొదటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ దూకుడు’. ఆ చిత్రానికి దర్సకత్త్వం వహించిన శ్రీను వైట్ల కి నో చెప్పినందుకు అప్పట్లో సమంత పై చాలా విమర్శలు కూడా వచ్చాయి. కానీ చిత్రం విడుదలైన తర్వాత అందరికీ అనిపించింది ఏమిటంటే ఈ సినిమా చేసి ఉంటే సమంత కెరీర్ రిస్క్ లో పడేది, రిజెక్ట్ చేసి మంచి పని చేసింది అని అనుకున్నారు.

raviteja-samantha

ఈ చిత్రం తర్వాత పాపం డైరెక్టర్ శ్రీను వైట్ల టాలీవుడ్ లో అవకాశాలు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఆయన ఖాళీగానే ఇంట్లో కూర్చున్నాడు. మనం జీవితం లో మర్చిపోలేని ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించిన ఒక లెజెండరీ డైరెక్టర్ కి ఇలాంటి పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరం. రవి తేజ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం 5 సినిమాలో నటిస్తున్న రవి తేజ టాలీవుడ్ లోనే బిజీ హీరోగా నిలిచాడు. ఆ ఐదు సినిమాలో 4 ఈ ఏడాదే రిలీజ్ అవ్వబోతున్నాయి, ఇది ఫాన్స్ కి చాల స్పెషల్ అనే చెప్పుకోవాలి. రవి తేజ కూడా మంచి హిట్ అందుకుని చాలా రోజులే అయింది. ఈ సినిమాలతో హిట్ కొట్టాలి రవి తేజ అని ఫాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts