Friday, September 20, 2024
HomeCinemaSamantha: ఆ విషయంలో సమంతనే మించిపోయిన తల్లి.. బుద్ధులు అక్కడ నుండి వచ్చాయి అనమాట..

Samantha: ఆ విషయంలో సమంతనే మించిపోయిన తల్లి.. బుద్ధులు అక్కడ నుండి వచ్చాయి అనమాట..

Samantha US Visit: సోషల్ మీడియా లో సమంత పేరు వినిపించని రోజంటూ ఉండదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అక్కినేని నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత ఈమె వచ్చినన్ని రూమర్స్ ఇండస్ట్రీ లో ఏ హీరోయిన్ మీద కానీ, హీరో మీద కానీ రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక రీసెంట్ గా ఆమె విజయ్ దేవరకొండ తో కలిసి ‘ఖుషి’ అనే చిత్రం లో నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 1 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ మాత్రమే కనిపిస్తూ ఉంది.

samantha-us-visit-with-mother-is-not-just-for-treatment-she-is-also-doing-that-in-america

ఇకపోతే రీసెంట్ గా సమంత మరియు విజయ్ దేవరకొండ ‘ఖుషి లైవ్ మ్యూజిక్ కన్సర్ట్’ లో చేసిన లైవ్ రొమాంటిక్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ అయితే అందరినీ షాక్ కి గురి అయ్యేలా చేసింది. ఈ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ గురించి పక్కన పెడితే వీళ్లిద్దరి మీద మొదటి నుండే సోషల్ మీడియా లో చాలా నెగటివిటీ ఉంటుంది, ఇప్పుడు ఆ నెగటివిటీ ఈ పెర్ఫార్మన్స్ కారణంగా పదింతలు పెరిగింది అని కామెంట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు సమంత తో పాటుగా ఆమె తల్లి ‘నిన్నెత్తే ప్రభు’ కూడా సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈమె గతం లో కూడా సమంత తో కలిసి అనేక ఈవెంట్స్ లో పాల్గొన్నది.

samantha-mother

నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత డీలాపడిన సమంత నేడు ఇంత తొందరగా కోలుకొని మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యిందంటే దానికి కారణం ఆమె తల్లి ఇచ్చిన ప్రోత్సాహమే అని అంటున్నారు(Samantha US Visit). ఇదంతా పక్కన పెడితే సమంత తల్లి కి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారాయి. సమంత తో కలిసి విమానాశ్రయం లో నడుస్తూ ఉన్న ‘నిన్నెత్తే ప్రభు’ మోడరన్ లుక్స్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపొయ్యేలా చేసింది. స్టైలిష్ వెస్ట్రన్ దుస్తుల్లో కనిపించిన ఆమెని చూసి అందరూ నోరెళ్లబెట్టారు.

samantha

ఇన్ని రోజులు కేవలం చీరల్లో మాత్రమే కనిపించిన ఆమెలో ఈ కోణం కూడా దాగుందా అంటూ సమంత అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఆమె నుండి సమంత కి ఈ స్టైల్ వచ్చి ఉంటుందని కూడా కామెంట్ చేస్తున్నారు. సమంత వి గత 2-3 సినిమాలు ప్లాప్ అవ్వటంతో అందరూ సమంత టైం ఐపోయింది అని అనుకున్నారు, కానీ ఇపుడు ఖుషి సినిమాతో సమంత తిరిగి వచ్చింది. ఈ సినిమా కానీ హిట్ ఐతే సమంతని ఎవ్వరు ఆపలేరు. విజయ్ దేవరకొండ కూడా లైగర్ ప్లాప్ అవ్వటంతో తన ఆశలన్నీ ఖుషి సినిమా పైనే పెట్టుకున్నాడు. ఖుషి సినిమా సమంత విజయ్ దేవరకొండల ఫుటరు ఎలా ఉంటుందో తెలిపే సినిమా.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts