Samantha : గత 18 నెలలనుండి మయోసైటిస్ తో సమంత బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధి రావటంతో సమంత సినిమాలకు దూరమయ్యి ఇంట్లోనే ఉంటూ ఈ వ్యాధికి చికిత్స పొందుతుంది. మెల్లి మెల్లిగా ఆ వ్యాధి నుంచి కోలుకుంటుంది సమంత. మల్లి మంచి సినిమా అవకాశం వస్తే తిరిగి వచ్చి సినిమా కూడా చేసేందుకు సిద్ధం అవుతుంది సామ్. సమంత ఇటీవలే ఒక పోడ్ కాస్ట్ ప్రారంభించింది. ఆ పోడ్ కాస్ట్ లో తన అనుభవాలను, ఆరోగ్యం గురించి పంచుకుంటుంది.
అంతే కాకుండా సోషల్ మీడియా లో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ అదిరిపోయే ఫోటో లతో తన అభిమానులని అలరిస్తూ ఉంటుంది సామ్. ఇటీవలే తన పోడ్ కాస్ట్ లో సమంత తన మయోసైటిస్ గురించి మాట్లాడుతూ విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమా చేసిన వెంటనే అమెజాన్ వారితో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ఒప్పుకున్నా. అప్పటికి మయోసైటిస్ పూర్తిగా తగ్గలేదు. ఆ వెబ్ సిరీస్ లో యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నపుడు నొప్పి తిరిగి వచ్చేది.
ఒకసారి ఐతే కళ్ళు తిరిగి పడిపోయాను, వెంటనే మా సిబ్బంది డాక్టర్ ను పిలిచి నాకు బాగయ్యేలా చికిత్స చేపించారు . ఆరోజు షూటింగ్ మొత్తం ఆగిపోయింది, అందరూ చాలా నిరాశ చెందారు ఏదోలా కష్ట పడి ఆ సిరీస్ షూటింగ్ మొత్తం పూర్తిసేసాను అంటూ తన అనుభవం చెప్పుకొచ్చింది సమంత. ప్రస్తుతం ఈ సిరీస్ రిలీజ్ అయ్యేందుకు రెడీ గా ఉంది. చూడాలి మరి ఈ సిరీస్ తో సమంత కం బ్యాక్ ఇస్తుందో లేదో..