Samantha : ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది సమంత. అతి కొద్దీ కాలం లోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇండస్ట్రీ లోకి వచ్చిన వెంటనే ప్రతి టాప్ హీరో తో సినిమా ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్ముడు. ఇక నాగ చైతన్యతో కలిసి సినిమా చేసిన సమయంలోనే అతడితో ప్రేమలో పడింది. 3 ఏళ్ళు కలిసి తిరిగి ఇంట్లో ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారు సమంత నాగ చైతన్య. ఇక పెళ్లయిన 4 ఏళ్లకే విడాకులు కూడా తీసుకున్నారు.
నాగ చైతన్య తో విడాకుల తరువాత సమంత ఫేమ్ కొద్దిగా తగ్గింది అనే చెప్పాలి. ఇక పుష్ప సినిమా లో ఐటెం సాంగ్ చేసి మరి దిగజారిపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఫాన్స్ సమంతను ట్రోల్ చేస్తూనే వచ్చారు. ప్రస్తుతం మయోసైటిస్ నుంచి కోలుకొని మల్లి సినిమాలు చేస్తుంది. అమెజాన్ తో కలిసి సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తుంది. ఈ వెబ్ సిరీస్ కోసం దాదాపు 10 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంది సామ్.
సమంత సీనియర్ హీరో మమ్మూట్టి తో కలిసి ఒక బంగారం లోన్ కంపెనీ యాడ్ చేసింది. ఆ యాడ్ బాగా వైరల్ అవ్వటంతో హీరో మమ్మూట్టి సమంతను తన తరువాయి సినిమాలో ఒక క్యారెక్టర్ చేసేందుకు అడిగాడు అట. దానికి సమంత కూడా ఓకే చెప్పేసింది అంటూ సినీ వర్గాల్లో నడుస్తున్న చర్చ. ఏ హీరోయిన్ కూడా వయసుపడ్డ సీనియర్ హీరో పక్కన నటించటానికి ఒప్పుకోరు, మరి సమంత ఒప్పుకోవటం ఏంటి అంటూ ఫాన్స్ ప్రశ్నిస్తున్నారు.