Home Cinema Samyuktha Menon: టాలీవుడ్ కి సంయుక్త మీనన్ గుడ్ బై.. కారణం ఆ హీరోయిన్..

Samyuktha Menon: టాలీవుడ్ కి సంయుక్త మీనన్ గుడ్ బై.. కారణం ఆ హీరోయిన్..

Samyuktha Menon: ఇటీవల కాలం లో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొంతమంది కుర్ర హీరోయిన్స్ అతి తక్కువ సమయం లోనే స్టార్ ఇమేజి ని దక్కించుకొని కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. శ్రీలీల ఆ జాబితా కి చెందిన అమ్మాయే. అయితే ఈమె మాయలో మన స్టార్ హీరోలు , దర్శక నిర్మాతలు ఏ రేంజ్ లో పడ్డారంటే, శ్రీలీల ఉంటేనే సినిమాలు చేస్తాము, లేదంటే లేదు అనే రేంజ్ వచ్చేసారు(Samyuktha Menon Quit Movies). ఈమె దాటికి అంతకు ముందు ఉన్న స్టార్ హీరోయిన్స్ మాత్రమే కాదు, కొత్తగా వచ్చిన హీరోయిన్స్ కెరీర్స్ కూడా రిస్క్ లో పడ్డాయి.

actress-samyuktha-menon

అలాంటి హీరోయిన్స్ లో ఒకరు సంయుక్త మీనన్ ఒకరు. ‘భీమ్లా నాయక్’ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె తొలిసినిమానే సూపర్ హిట్ అవ్వడం తో అవకాశాలు వెల్లువలాగా వచ్చి పడ్డాయి. ఈ చిత్రం తర్వాత ఆమె చేసిన ‘భింబి సారా’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత తమిళ హీరో ధనుష్ తో కలిసి నటించిన ‘సార్’ చిత్రం కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన ‘విరూపాక్ష’ సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇలా ముట్టుకున్న ప్రతీ సినిమా బంగారం అవ్వడం తో ఈమెకి గోల్డెన్ లెగ్ అనే పేరు వచ్చింది.

ఆ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ వచ్చింది అంటూ రూమర్స్ వచ్చాయి. వాస్తవానికి ఆమెని హీరోయిన్ గా తీసుకుందాం అనుకున్నారు కానీ, ఆమె కంటే శ్రీలీల ఇంకా బెటర్ కదా అనే పాయింట్ మీదకి వచ్చి శ్రీలీల ని హీరోయిన్ గా తీసుకున్నారు. ‘గుంటూరు కారం’ చిత్రం కూడా అంతే, ముందుగా పూజ హెగ్డే ని తీసుకున్నారు, ఆమె కొన్ని కారణాల చేత సినిమా నుండి తప్పుకోవడం తో ఆమె ప్లేస్ లోకి మెయిన్ హీరోయిన్ గా సంయుక్త మీనన్(Samyuktha Menon Quit Movies) ని తీసుకోవాలి అనుకున్నారు. కానీ ఇక్కడ కూడా ఆ పాత్ర కి శ్రీలీల ని రీ ప్లేస్ చేసారు.

అలా చెప్పుకుంటూ పోతే ఈ మలయాళీ బ్యూటీ కి చాలా సినిమాలు ఇలాగే శ్రీలీల వల్ల మిస్ అవుతున్నాయి అని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న టాక్. ప్రస్తుతం ఆమె కళ్యాణ్ రామ్ తో ‘డెవిల్’ అనే చిత్రం లో నటిస్తుంది. ఈ సినిమా తర్వాత ఆమె మల్లి తన సొంత మలయాళం ఇండస్ట్రీ కి శాశ్వతంగా వెళ్ళిపోబోతుందని టాక్. సంయుక్త ప్రస్తుతం తెలుగులో నటిస్తున్న సినిమా డెవిల్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఆగష్టు నా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

Exit mobile version