Home Cinema Santosh Sobhan : బంపర్ ఆఫర్ కొట్టేసిన యంగ్ హీరో.. మరో హిట్ పక్క..

Santosh Sobhan : బంపర్ ఆఫర్ కొట్టేసిన యంగ్ హీరో.. మరో హిట్ పక్క..

Santosh Sobhan : టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఇటీవల కాలంలో యంగ్ హీరోలు వస్తున్నారు. ఫ్యామిలీ లో ఒక్కరైనా సినిమా ఇండస్ట్రీలో ఉంటే మరొకరు సులభంగా నటులుగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఇలా సంతోష్ శోభన్ తన అన్న మార్గంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరో గా పరిచామయాడు. అతని కెరీర్ లో ఒక్క హిట్ సినిమా లేకపోయినా అతను ఎప్పుడూ ఖాళీగా ఉండడు. పెద్ద బ్యానర్లతో సినిమాలు తీస్తున్నాడు.

ప్రభాస్ హోమ్ బ్యానర్ అయినా యువి క్రియేషన్‌లో సంతోష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఏక్ మినీ కథ ఈ బ్యానర్ చిత్రీకరించబడిన చిత్రం. ఈ చిత్రం సంతోష్ శోభన్ మొదటి సినిమా. ఇది OTTలో విడుదలై ఘన విజయం సాధించింది. దీని తరువాత, అతను అదే బృందంతో “కల్యాణం కమనీయం” సినిమాలో కూడా హీరోగా నటించాడు. ఇప్పుడు మళ్లీ యువీతో కలిసి పని చేయనున్నారు. అతను ఈ బ్యానర్ పై చేస్తున్న మూడవ చిత్రం. ఈ స్టోరీ అతనికి చెప్పగానే ఇట్టే అంగీకరించాడు.

santosh-sobhan-to-act-under-prabhas-production-banner-for-third-time

రేపు సంతోష్ శోభన్ పుట్టినరోజు. సందర్భంగా యూవీ క్రియేషన్స్ ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేయనుంది. అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిస్ ఇండియా మానస వారణాసి కథానాయికగా నటించింది. ఇది ఆమె రెండో సినిమా. అశోక్ గల్లా నటించిన దేవకీ నందన వాసుదేవ చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా చేస్తున్న సమయంలో మరో ఆఫర్ వచ్చింది. ఈ కొత్త చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు రేపు ప్రకటిస్తారు.

Exit mobile version