Home Cinema Varun Sandesh : రాజ్ తరుణ్ – లావణ్య గురించి స్పందించిన వరుణ్ సందేశ్.. ఏమన్నాడో...

Varun Sandesh : రాజ్ తరుణ్ – లావణ్య గురించి స్పందించిన వరుణ్ సందేశ్.. ఏమన్నాడో తెలుసా..

Varun Sandesh : వరుణ్ సందేశ్ ఒక్కపుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోయాడు. ఆయన నటించిన చిత్రాలు హ్యాపీడేస్, కొత్త బంగారులోకం, కుర్రాడు, మరోచరిత్ర విజయం సాధించాయి. అయితే టాలీవుడ్‌లో వరుణ్ ఒక్కసారిగా కనుమరుగయ్యాడు. ఆయన సినిమాలు వరుసగా పరాజయం పాలవడంతో ఆయనకు ఎవరూ అవకాశం ఇవ్వలేదు. అందుకే ఇండస్ట్రీకి కొద్ది రోజులు విరామం ఇచ్చాడు. తర్వాత భర్తతో కలిసి బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని మళ్లీ ఫేమస్ అయ్యాడు.

ప్రస్తుతం వరుణ్ సందేశ్ వరుస సినిమాల్లో నటించి మరోసారి తన సత్తా చాటుతున్నాడు. అయితే తాజాగా ఆయన నటించిన ‘విరాజీ’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో వరుణ్ సందేశ్ రాజ్ తరుణ్ మరియు లావణ్యల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సినిమా రంగానికి సంబంధించిన వరుణ్ సందేశ్, నిఖిల్, రాజా రవీంద్ర లాంటి వాళ్లకు తమ ప్రేమ, పెళ్లి విషయం తెలుసు అని లావణ్య చెప్పిన సంగతి మనకు తెలిసిందే.

varun-sandesh-spoke-about-raj-tarun-lavanya-issue-in-his-pre-release

అయితే విరాజ్ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా వరుణ్ సందేశ్ ఓ ఇంటర్వ్యూకు హాజరు కాగా, ఆ ఇంటర్వ్యూయర్ అతడిని దీనికి సంబందించిన ఓ ప్రశ్న అడగగా, వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, రాజ్ తరుణ్, లావణ్య నాకు చాలా కాలంగా తెలుసు. వారు మా ఇంటికి దగ్గరగా ఉండటం వల్ల మాకు చాలా సంవత్సరాలుగా వీరు తెలుసు. అయితే ఏడాదిన్నరగా వారితో మాకు పెద్దగా పరిచయం లేదు. అంతేకాకుండా వీరి బంధంపై కేసు కోర్టులో నడుస్తుండడం వలన నేను దీని గురించి మాట్లాడలేను అంటూ సమాధానం ఇచ్చాడు వరుణ్.

Exit mobile version