Monday, November 25, 2024
HomeCinemaRohini: కాస్టింగ్ కౌచ్ వేధింపుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి రోహిణి..

Rohini: కాస్టింగ్ కౌచ్ వేధింపుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి రోహిణి..

Rohini : క్యాస్టింగ్ కౌచ్ సమస్య ప్రతీ ఇండస్ట్రీ లో ఉండేదే, కానీ రీసెంట్ గా మలయాళం ఫిలిం ఇండస్ట్రీ లో హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ఎలాంటి దుమారం రేపిందో, ఇండస్ట్రీ లో ఎలాంటి కలకలం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సుమారుగా 7 ఏళ్ళ పాటు మలయాళం ఫిలిం ఇండస్ట్రీ లో మహిళా ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు ఎదురుకుంటున్న కష్టాలను, సాంకేతిక విభాగం లో వాళ్లకు ఇస్తున్న ప్రాముఖ్యత, అవుట్ ఇదే షూటింగ్ లొకేషన్స్ సమయంలో మహిళలకు కావాల్సిన కనీస వసతులు, స్టార్ హీరోల నుండి కొంతమంది మహిళా ఆర్టిస్టులకు ఎదురు అవుతున్న లైంగిక వేధింపులు, ఇవన్నీ చాలా దగ్గర నుండి పరిశీలించి తయారు చేసిన నివేదిక ఇది.

ఈ నివేదిక చూసిన తర్వాత ఇండస్ట్రీ లో మహిళలు ఇన్ని సమస్యలు ఎదురుకుంటున్నారా? అయ్యో పాపం అని జాలి చూపించక తప్పదు. ఆ స్థాయిలో ఉన్నాయి ఇవి. అయితే మహిళల పట్ల మలయాళం సినీ ఇండస్ట్రీ లో మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు ఒక కమిటీ ని ఏర్పాటు చేసారు. ఈ కమిటీ లో సభ్యురాలిగా కొనసాగుతున్న ప్రముఖ నటి రోహిణి ఇటీవలే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘మహిళలు వారిపై జరుగుతున్న దౌర్జన్యాలు, అన్యాయాల గురించి ఈ కమిటీ వద్ద ఫిర్యాదులు చేయాలి.

మాకు ఫిర్యాదు చేస్తే మేము నేరుగా పోలీసుల దగ్గరకు తీసుకెళ్తాము. మిమ్మల్ని ఎంత పెద్ద నటుడైన, డైరెక్టర్ అయినా భయపెట్టి ఉండొచ్చు, కానీ ఏమాత్రం భయం చూపించకండి, ధైర్యం గా ముందుకు రండి. మీడియా ముందుకు చేరి క్యాస్టింగ్ కౌచ్ సమస్యల మీద మాట్లాడడం వల్ల మీకు జరిగే ఉపయోగం ఏమి ఉండదు. దాదాపుగా 7 ఏళ్ళ పాటు ఎంతో శ్రమించి హేమా కమిటీ ఈ నివేదిక ని సిద్ధం చేసింది’ అంటూ చెప్పుకొచ్చింది రోహిణి.

రోహిణి(Rohini) అంటే మీకు సడన్ గా గుర్తుకు రాకపోవచ్చు కానీ, ఈమె ముఖాన్ని చూస్తే గుర్తు పట్టని వాళ్లంటూ ఎవరూ ఉండరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అనేక సినిమాల్లో ఈమె హీరో , హీరోయిన్స్ పాత్రలకు తల్లి పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఒకప్పుడు హీరోయిన్ గా కొనసాగిన ఈమె ప్రముఖ విలన్ రఘువరన్ ని ప్రేమించి పెళ్లాడింది. అతను చనిపోయాక ఒంటరిగా తన ప్రయాణం ని కొనసాగిస్తుంది, ఈమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts