Friday, August 23, 2024
HomeCinemaShakeela : బిగ్ బాస్ లో పాల్గొనేందుకు షకీలా తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు..!

Shakeela : బిగ్ బాస్ లో పాల్గొనేందుకు షకీలా తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు..!

Shakeela : కోట్లాది మంది తెలుగు ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సీజన్ సెప్టెంబర్ 3 వ తారీఖు నుండి టెలికాస్ట్ కాబోతున్నట్టుగా రీసెంట్ గానే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సీజన్(Shakeela Bigg Boss Remuneration) కి సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇవన్నీ చూసిన ఆడియన్స్ ఈసారి బిగ్ బాస్ సీజన్ కొత్తగా ఉండబోతుందని మాత్రం అర్థం చేసుకున్నారు.

shakeela-remuneration-for-bigg-boss-will-blow-your-mind

కంటెస్టెంట్స్ ఎవరు ఏమిటి అనేది ఇంకా పూర్తిగా బయటకి రాలేదు కానీ, కొంతమంది పేర్లు మాత్రం కచ్చితంగా వినిపిస్తున్నాయి. వారిలో టీవీ యాంకర్స్ , సీరియల్స్ యాక్టర్స్ మరియు పలువురి యూట్యూబర్స్ తో పాటుగా సీనియర్ నటులు కూడా ఉన్నారు. వారిలో షకీలా కూడా ఒకరు. ఈమెకి ఒకప్పుడు ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మలయాళం లో ఈమె సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే అక్కడి స్టార్ హీరోల సినిమాలు వాయిదా పడేవి.

shakeela-remuneration-for-bigg-boss

ఆ రేంజ్ లో క్రేజ్ ఉన్న ఈమె తెలుగు లో కూడా రీసెంట్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా చేసింది. అడల్ట్ సినిమాలకు పెట్టింది పేరు లాంటిదైనా షకీలా ఇప్పుడు బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా రాబోతుంది. అంత పెద్ద స్టార్ వస్తుంది కాబట్టి కచ్చితంగా ఆమెకే మొదటి వారం నుండి ఎక్కువ ఓటింగ్ ఉంటుంది. బాగా గేమ్ ఆడితే కచ్చితంగా విన్నర్ కూడా అవ్వొచ్చు. యావరేజి గా ఆడినా కూడా ఆమె చివరి వారం వరకు ఉండగలదు.

Shakeela

అలా చివరి వారం వరకు ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉంటే 50 లక్షలు ఇస్తామని బిగ్ బాస్ యాజమాన్యం ఆఫర్ ఇచ్చింది అట. దాదాపుగా టైటిల్ విన్నర్ కి ఇచ్చేంత డబ్బులు ఈమెకి ఇస్తున్నారు. ఇది సాధారణమైన విషయం కాదు. ప్రస్తుతం షకీలా కి సినిమాల్లో ఎలాంటి అవకాశాలు రావడం లేదు. ఆమెకి(Shakeela Bigg Boss Remuneration) ఇప్పుడు ఇలాంటి అద్భుతమైన అవకాశం రావడం నిజంగా ఆమె కెరీర్ టర్నింగ్ పాయింట్స్ లో ఒకటిగా చెప్పొచ్చు.

మరి ఈమె బుల్లితెర ఆడియన్స్ ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంటుందా..? అసలు ఈమె ఎలా ఆడబోతుంది అనేది తెలియాలంటే వచ్చే నెల 3 వ తేదీ వరకు ఆగాల్సిందే.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts