Home Cinema Mangalavaram Movie : మంగళవారం సినిమాలో పాయల్ పాత్రను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్.....

Mangalavaram Movie : మంగళవారం సినిమాలో పాయల్ పాత్రను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్.. ఎవరంటే..

Mangalavaram Movie : ఇటీవల సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన మంగళవారం సినిమా గురించి వినిపిస్తుంది. అందాల భామ పాయల్ రాజపుత్ లీడ్ పాత్రలో నటించిన మంగళవారం సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా కథ రాసుకొని దర్శకత్వం వహించాడు rx 100 ఫేమ్ అజయ్ భూపతి. ఈయన ( Mangalavaram Movie Shraddha Das ) మొదటి చిత్రం rx 100 తోనే బారి విజయం సాధించాడు. ఆ తరువాత అజయ్ తెరకేకించిన మహా సముద్రం బారి అంచనాలతో విడుదలై డిసాస్టర్ గా నిలిచింది.

shraddha-das-rejected-payal-character-in-mangalavaram

ఈ సినిమా తరువాత అజయ్ దర్శకత్వం వహించిన చిత్రం మంగళవారం. ఈ సినిమా లో మెయిన్ రోల్ లో డైరెక్టర్ తన లక్కీ చార్మ్ అయినా పాయల్ రాజపుత్ ను పెట్టి తీసాడు మరియు మంచి విజయం అందుకున్నాడు అనే చెప్పుకోవాలి. మంగళవారం సినిమాలో హీరోయిన్ పాయల్ నటన ను మెచ్చుకుంటూ సినీ సెలెబ్రిటీలు పోస్ట్ లు కూడా చేస్తున్నారు. పాయల్ rx 100 సినిమాలో చేసిన బోల్డ్ పాత్రల వల్లే ఫేమస్ అయినా ఈ హీరోయిన్ మల్లి ఈ సినిమాలో కూడా అలంటి బోల్డ్ సన్నివేశాలలో నటించి యువతను ఆకట్టుకుంది.

మంగళవారం సినిమా అన్ని థియేటర్ లలో హౌస్ ఫుల్ నడుస్తుంది. ఇదిలా ఉంటె, మొదట డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమాలో పాయల్ ప్లేస్ లో వేరే హీరోయిన్ ను అనుకున్నారట. కానీ ఆ హీరోయిన్, కథలో చాలా బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయి అని ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట. దీనితో అజయ్ భూపతి వేరే ఛాన్స్ లేక తన లక్కీ చార్మ్ అయినా పాయల్ ను సంప్రదించాడు మరియు పాయల్ కూడా ఇట్టే ఓకే చెప్పింది.

పాయల్ రాజపుత్ కు మంగళవారం తో చాల రోజులకు మల్లి హిట్ దక్కింది. ఇంతకీ ఇంత మంచి సినిమాను వదులుకున్న ఆ అన్ లక్కీ హీరోయిన్ ఎవరో మనం ఇపుడు తెలుసుకుందాం.

ఆ హీరోయిన్ మరెవరో కాదు శ్రద్ధ దాస్. ఈ అమ్మడు ( Mangalavaram Movie Shraddha Das ) బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి అని ఈ సినిమా ను రిజెక్ట్ చేసినందుకు ఇప్పుడు తెగ బాదపడిపోతుందంట.

Exit mobile version