Singer Pranavi : తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎక్కడైనా కామన్ గా ఉండే సమస్య క్యాస్టింగ్ కౌచ్. కామాంధుల కోరిక తీర్చుకునేందుకు కోసం ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలగాలని వచ్చే అమ్మాయిలు ఎదురుకుంటున్న సమస్య ఇది. ఎవరో ఒకరిద్దరు చేసిన ఈ తప్పులకు ఇండస్ట్రీ మొత్తం ఈరోజు నిందలు అనుభవించాల్సి వస్తుంది. కొంతమంది హీరోయిన్స్ కెరీర్ కోసం దర్శక నిర్మాతల కోరికలు తీర్చడానికి సిద్దపడినా, కొంతమంది మాత్రం నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి క్యాస్టింగ్ కౌచ్ కి పూర్తి వ్యతిరేకంగా ఉంటూ సినిమా ఇండస్ట్రీ ని నుండి బయటకి వెళ్లిపోయారు.
ఈ క్యాస్టింగ్ కౌచ్ సమస్య కేవలం హీరోయిన్స్ కి మాత్రమే ఉంది అనుకుంటే పొరపాటే. సింగర్స్ కూడా ఈ సమస్యని ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో ఎదురుకున్నారు. అలాంటి సింగర్స్ లో ఒకరు ప్రణవి. ఈమె రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కెరీర్ తొలినాళ్లలో ఇండస్ట్రీ లో ఎదురుకున్న సమస్యల గురించి చెప్పుకొచ్చింది. మాట్లాడాడు, ఇంత రేంజ్ కి వచ్చిన తర్వాత కూడా కొత్తవాళ్లతో ఇంత సంస్కారం గా వ్యవహరిస్తారా అని అనుకున్నాను(Singer Pranavi). కానీ ఆ తర్వాతే తెలిసింది అతని అసలైన బుద్ధి, తన సినిమాలో పాట పాడే ఛాన్స్ కావాలి అంటే కచ్చితంగా ఒక రోజు మొత్తం నాతో గడపాల్సిందే అని ఒక షరతు పెట్టాడట.
దీనికి కోపం కట్టలు తెంచుకున్న ప్రణవి వెంటనే పైకి లేచి, ఎలా కనిపిస్తున్నాను నీకు ఇడియట్, చెప్పు విరిగిపోతాది జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వచ్చేసిందట ప్రణవి. ఇదంతా చూస్తుంటే కింగ్ సినిమాలో బ్రహ్మానందం మరియు త్రిష మధ్య వచ్చిన సన్నివేశం గుర్తుకు వస్తుంది కదూ, శ్రీను వైట్ల ఈ సంఘటన ని ఆధారంగా తీసుకొనే ఆ సన్నివేశం రాసాడని అప్పట్లో టాక్ ఉండేది. ఇక ప్రణవి గురించి మన అందరికీ తెలిసిందే. ఈమె సౌత్ లోనే బిగ్గెస్ట్ స్టార్ సింగర్స్ లో ఒకరు. ఈమె తెలుగు మరియు తమిళం భాషలకు కలిపి దాదాపుగా వెయ్యికి పైగా పాటలు పాడింది.
ఇప్పటికీ క్రేజీ మూవీస్ కి ఆమె పాటలు పాడుతూనే ఉంది. ఈమె ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రఘు ని ప్రేమించి పెళ్లాడింది. వీళ్లిద్దరు కలిసి ఎన్నో ఇంటర్వ్యూస్ ఇది వరకు ఇచ్చారు కూడా. సింగర్ ప్రణవి గుంటూరు లో జన్మించింది. తిను చిన్నపుడు దూరదర్శన్ లో వచ్చే ఒక పాటల పోటీలో పాల్గొని గెలిచింది. అప్పటి నుంచి పాటల పై మక్కువ పెరిగింది.
అలా తన కెరీర్ ను ప్రారంభించి ఇప్పుడు ఈ రేంజ్ కి ఎదిగింది. తన కెరీర్ లోనే తనకు పేరు తెచ్చిన పాట ‘ఈ వేళలో నీవు’. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ఈ పాట అప్పట్లో చాల పెద్ద హిట్టు. తిను డాన్స్ మాస్టర్ రాఘ ని 2016 లో వివాహం ఆడింది.