Sonia Akula : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి క్యూట్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన వారిలో ఒకరు సోనియా ఆకుల. ఈమె హౌస్ ని ప్రస్తుతం ఎలా డదడలాడిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. టాస్కులు ఎలా ఆడుతుందో ఇప్పటి వరకు తెలియదు కానీ, బిగ్ బాస్ షో కి కావాల్సినంత కంటెంట్ మాత్రం ఇస్తుంది. హౌస్ లో నిఖిల్ తో ప్రేమాయణం నడుపుతూ వార్తల్లో నిల్చింది. నిన్న మొన్నటి వరకు ఈమె కేవలం నిఖిల్ తోనే ప్రేమాయణం నడుపుతుందని అందరూ అనుకున్నారు, ఇప్పుడు పృథ్వీ రాజ్ తో కూడా ఈమె క్లోజ్ గా నడుచుకుంటుంది.
నిన్న జరిగిన ఎపిసోడ్ లో కూడా ఈమె(Sonia Akula) నిఖిల్ ని పెద్దోడు అని, పృథ్వీ రాజ్ ని చిన్నోడు అని సంబోధించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే ఈమెకి ఇద్దరూ కావాలన్నమాట అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈమె ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియా గురించి మాట్లాడిన మాటలు, ఆమెతో గొడవ పడిన తీరుపై సోషల్ మీడియా లో విపరీతమైన చర్చలు నడుస్తుంది. ఒక అమ్మాయి అయ్యుండి, మరో అమ్మాయి మీద ఇలాంటి కామెంట్స్ చేయడానికి సిగ్గు గా లేదా, విష్ణు ప్రియా ని అడల్ట్ కమెడియన్ అంటున్నావ్, మరి రోజు నువ్వు హౌస్ లో నిఖిల్ తో చేస్తున్నది ఏమిటి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ నిలదీస్తున్నారు.
ఆడపులి అని నీకు నువ్వు డప్పులు కొట్టుకుంటున్నావ్, కానీ నువ్వు ఆడ పులి కాదు, ఆడ పిల్లివి అంటూ వెక్కిరిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే సోనియా ఆకుల బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టక ముందు ఆమె రాంగోపాల్ వర్మ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఆయన తెరకెక్కించిన ‘కరోనా వైరస్’ అనే చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తో పాటు ఆమె జార్జి రెడ్డి అనే చిత్రంలో కూడా హీరో చెల్లి పాత్రలో కనిపించింది.
ఇదంతా పక్కన పెడితే రామ్ గోపాల్ వర్మ తో పని చేసిన అనుభూతి గురించి సోనియా పంచుకుంటూ, రామ్ గోపాల్ వర్మ ఒక రోజు నన్ను ఇంటికి రమ్మని పిలిచాడు. ఇంటికి ఎందుకు రమ్మన్నాడు, నాతో ఏమైనా అసభ్యంగా ప్రవర్తించాలని అంకుంటున్నాడా అనే భయం తోనే వెళ్లిందట. కానీ అలాంటివేమీ జరగలేదట, కేవలం సినిమాకి సంబంధించిన చర్చలు మాత్రమే జరిగాయని సోనియా ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.