Sreeleela Doing Mistake : ఈమధ్య కాలం లో ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి శ్రీలీల. పెళ్లి సందడి అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా పరిచయమైనా ఈమె తొలిసినిమా తోనే అందరినీ ఆకట్టుకుంది. అందం, అభినయం తో పాటుగా చాలామంది హీరోయిన్స్ లో లేని అద్భుతమైన డ్యాన్స్ టాలెంట్ శ్రీలీల సొంతం. ఆమె హీరోయిన్ గా నటించిన గత చిత్రం ‘ధమాకా’ అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి కారణం శ్రీలీలనే. ఈ ఒక్క సినిమాలో ఆమె ప్రతిభ ని కళ్లారా చూసిన దర్శకనిర్మాతలు తమ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకునేందుకు ఎగబడ్డారు.
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్స్ దగ్గర నుండి , కుర్ర హీరోలు మరియు సీనియర్ హీరోలు కూడా ఇప్పుడు శ్రీలీల కాల్ షీట్స్ కోసం ఎదురు చూసే పరిస్థితి. ఇలాంటి రేంజ్ అందరికీ దక్కేది కాదువంద మంది హీరోయిన్లు ఇండస్ట్రీ కి వస్తే అందులో కేవలం ఒకరిద్దరికి మాత్రమే ఈ రేంజ్ దక్కుతుంది. అలాంటి అరుదైన అదృష్టం శ్రీలీల కి దక్కింది. ప్రస్తుతం ఆమె క్రేజ్ పీక్ రేంజ్ లో ఉంది కాబట్టి, ఆ క్రేజ్ ని సంపూర్ణంగా వాడుకునేందుకు సిద్ధమైంది శ్రీలీల (Sreeleela Doing Mistake). ప్రస్తుతం ఈమె చేతిలో 10 సినిమాలు ఉన్నాయి. ధమాకా తర్వాత ఆమె వెంటనే ఒప్పుకున్న చిత్రం బాలయ్య బాబు హీరో గా నటిస్తున్న ‘భగవంత్ కేసరి’.
ఈ సినిమా కోసం శ్రీలీల కోటి రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంది. కానీ ఎప్పుడైతే మహేష్ బాబు ‘గుంటూరు కారం’ నిర్మాతలు రెండున్నర కోటి రూపాయిల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసారో, అప్పటి నుండి శ్రీలీల మీడియం రేంజ్ హీరో సినిమాకి రెండున్నర కోటి రూపాయిలు, అలాగే స్టార్ హీరో సినిమాకి మూడున్నర కోటి రూపాయిలు డిమాండ్ చేస్తుందట. ఆమె డిమాండ్ చూసి నిర్మాతలు బెదిరిపోతున్నారు. ఇప్పుడే ఆమె ఇంత డిమాండ్ చేస్తే రేపు గుంటూరు కారం మరియు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు హిట్ అయితే 6 నుండి 10 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇలా అతికి పోతే ఆమెకి మొదటికే మోసం వస్తుందని అంటున్నారు విశ్లేషకులు, చూడాలి మరి. ప్రస్తుతం ఐతే అమ్ముడికి చాలనే సినిమాలు చేతిలో ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబుతో గుంటూరు కారం, బాల కృష్ణతో భగవత్ కేసరి, కన్నడలో జూనియర్ అనే సినిమా, విజయ్ దేవరకొండతో VD 12 అనే సినిమా, ఇలా మరెన్నో సినిమాల అగ్రిమెంట్ సైన్ చేసి పాప చాల బిజీ ఐపోయింది. ఇన్ని సినిమాల్లో ఎన్ని హిట్ కొడుతుందో చూడాలి మరి శ్రీలీల.