Friday, September 20, 2024
HomeCinemaSreeleela: ఆ హీరో తో నటించడానికి వీలు లేదు అంటూ శ్రీలీలకి తల్లి స్ట్రాంగ్ వార్నింగ్.....

Sreeleela: ఆ హీరో తో నటించడానికి వీలు లేదు అంటూ శ్రీలీలకి తల్లి స్ట్రాంగ్ వార్నింగ్.. కారణం అదేనా..

Sreeleela: నేడు ఇండస్ట్రీ లో శ్రీలీల అనే అమ్మాయికి ఏ స్థాయి డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలు, సీనియర్ హీరోలు, మేడం రేంజ్ హీరోలు, అప్ కింగ్ హీరోలు, ఇలా ఇండస్ట్రీ లో ప్రతీ ఒక్కరికి ఇప్పుడు శ్రీలీల కాల్ షీట్స్ కావాలి. ఇండస్ట్రీ లో శ్రీలీల ఒక్కటే హీరోయిన్ అయ్యినట్టు, ఇలా అందరూ ఆమె వెంటపడడానికి కారణం ఆమెలో ఉన్న టాలెంట్(Sreeleela No To Nagarjuna). ముఖ్యంగా ధమాకా చిత్రం లో పెద్దగా విషయం లేకపోయినా కూడా, ఆ సినిమా అంత పెద్ద హిట్ అయ్యిందంటే దానికి కారణం శ్రీలీల వేసిన అద్భుతమైన ఎనెర్జిటిక్ డ్యాన్స్ వల్లే అని ట్రేడ్ పండితులు సైతం నమ్ముతున్నారు.

sreeleela-mother-dont-want-her-daughter-to-act-with-this-hero

కేవలం ఆమె డ్యాన్స్ కోసం వెళ్లే ఆడియన్స్ ఉన్నారు కాబట్టే శ్రీలీల కోసం ఎగబడుతున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో 11 సినిమాలు ఉన్నాయి. అందులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సినిమాలు కూడా ఉన్నాయ్. ఇది ఇలా ఉండగా శ్రీలీల ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టే ముందు ఆమె తల్లి స్వర్ణ లతా ఒక కండిషన్ పెట్టిందట. నువ్వు ఎలాంటి సన్నివేశాల్లో నటించినా, ఏ హీరో తో చేసినా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ, అక్కినేని నాగార్జున తో మాత్రం నటించడానికి వీలు లేదని చాలా బలమైన వార్నింగ్ ఇచ్చిందట(Sreeleela No To Nagarjuna). ఎందుకంటే ఆమెకి నాగార్జున అంటే ఎంతో ఇష్టమట.

nagarjuna

ఇప్పటికీ అతనిని ప్రేమిస్తూనే ఉన్నాను అని ఎన్నో సందర్భాలలో చెప్పిందట. అందుకే ఆ హీరో తో రొమాన్స్ చెయ్యడానికి నేను ఒప్పుకోను, ఒకవేళ చేస్తే నిన్ను ఇంట్లోకి కూడా రానివ్వను అంటూ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట. ఆ కండిషన్ కి ఒప్పుకొనే శ్రీలీల ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. శ్రీలీల తల్లి స్వర్ణలత బెంగళూరు లో టాప్ మోస్ట్ గైనకాలజిస్ట్ లో ఒకరు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక శ్రీలీల కూడా ప్రస్తుతం డాక్టర్ కోర్స్ చేస్తుంది, ఆమెకి రాబొయ్యే రెండు మూడు నెలల్లో పరీక్షలు ఉన్నాయట, ఈలోపు షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకోవాలని నిర్మాతలకు చెప్పిందట.

Sreeleela-with-mother

మరి ఆమె ఇంత కష్టమైన పరిస్థితిలో షూటింగ్స్ ఎలా పూర్తి చేస్తుందో, ఎలా చదువుకుంటుందో అని అభిమానులు సోషల్ మీడియా లో అనుకుంటూ ఉన్నారు. ఏదిఏమైనా కూడా శ్రీలీల చాల అదృష్ట వంతురాలు అనే చెప్పాలి, ఇండస్ట్రీ లోకి వచ్చి 2 ఏళ్ళు కూడా కాలేదు అప్పుడే ఇన్ని సినిమా ఆఫర్లు అది కూడా పెద్ద పెద్ద హీరోలు వెయిట్ చేస్తున్నారు తన డేట్స్ కోసం, మహేష్ బాబు లాంటి పెద్ద హీరోలు కూడా ఆ లిస్ట్ లో ఉన్నారు అనే నమ్మశక్యంగా లేదు.

ముందు టాప్ హీరోయిన్ లుగా ఉండే పూజ హెగ్డే, సమంత లను పక్కకు నెట్టేసి 4 సినిమాలు చేస్తూ బిజీ టాలీవుడ్ హీరోయిన్ లిస్ట్ లో చేరింది శ్రీలీల. చూడాలి మరి ఈ స్థానాన్ని ఈ ముద్దుగుమ్మ నిలపెట్టుకుంటుందో లేదో మరి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts