Sreemukhi: తెలుగు బుల్లితెర పై స్టార్ యాంకర్ గా కొనసాగుతూ అశేష ప్రేక్షాభిమానం పొందిన టాప్ 3 యాంకర్స్ లో ఒకరు శ్రీముఖి. ఈటీవీ ప్లస్ లో ప్రసారమయ్యే ‘పటాస్’ అనే ప్రోగ్రాం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఆమె, ఆ తర్వాత ఎన్నో టీవీ షోస్ కి యాంకర్ గా పని చేసి బిజీ గా మారిపోయింది (Sreemukhi Marriage). ప్రస్తుతం ఈమె స్టార్ మా ఛానల్ లో ‘నీతోనే డ్యాన్స్’ అనే షో కి యాంకర్ గా వ్యవహారిస్తుంది. సినిమాల్లో కూడా ఈమె ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించింది. అంతే కాకుండా బిగ్ బాస్ సీజన్ 3 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
ఈ సీజన్ కి ఆమె రన్నర్ గా నిల్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. అలా శ్రీముఖి బుల్లితెర మీద దూసుకొస్తోంది. ఇది ఇలా ఉండగా శ్రీ ముఖి కి ప్రస్తుతం 30 ఏళ్ళు వచ్చాయి. కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదు ఏంటి అని చాలా మందిలో సందేహం కలిగింది. అయితే గతం లో ఆమె ఒకరిని ప్రేమించాను అని, అతనితో బ్రేకప్ అవ్వడం వల్ల మానసికంగా చాలా కృంగిపోయానని, తేరుకోవడానికి చాలా సమయం పట్టిందంటూ గతం లో ఆమె ఒక షో లో చెప్పుకొచ్చింది. మళ్ళీ ప్రేమ పెళ్లి వైపు చూడలేదని కూడా చెప్పింది (Sreemukhi Marriage). అయితే ఇప్పుడు ఆమె అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న వార్త.
రీసెంట్ గానే ఆమె వైసీపీ ఎమ్యెల్యే రోజా తో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం ని చేసుకుంది. ఈమె దర్శనం చేసుకోవడానికి ప్రధాన కారణం పెళ్లి కోసమే అని తెలిసింది. గత రెండేళ్ల నుండి ఆమె ఒక వ్యక్తితో ప్రేమాయణం నడుపుతుంది. ఆ వ్యక్తి ఇండస్ట్రీ కి సంబందించిన వాడా?, లేదా బయటవాడా అనే విషయాన్నీ కాసేపు పక్కన పెడితే ఈమె పెళ్లి చేసుకోబోతుంది అనే విషయం మాత్రం ఖరారు అయ్యింది. త్వరలోనే ఈ విషయాన్నీ శ్రీముఖి స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోబోతున్నట్టు సమాచారం.
మరి పెళ్లి కొడుకు ఎవరు అయుంటారబ్బా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవేళ ఇండస్ట్రీ కి చెందిన వాడైతే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. శ్రీముఖి ప్రస్తుతం చిరంజీవి హీరో గా చేస్తున్న భోళా శంకర్ సినిమాలో కనిపించ బోతుంది. ఈ సినిమాలో శ్రీముఖి ఒక చిన్న ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఈ సినిమా షూటింగ్ పనులు అన్నిటిని పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉంది.