Home Cinema Shruti Haasan : నాతో అలాంటి సీన్స్ చేసేందుకు ఒప్పుకోలేదు..

Shruti Haasan : నాతో అలాంటి సీన్స్ చేసేందుకు ఒప్పుకోలేదు..

Shruti Haasan : కమల్ హస్సన్ కూతురిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది శృతి హస్సన్. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ తో తాను నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితం అయింది. ఆ తరువాత మరెన్నో సినిమాలు చేసి ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. మధ్యలో సినిమా ఇండస్ట్రీ నుండి బ్రేక్ తీసుకుని బాయ్ ఫ్రెండ్ తో ప్రపంచం అంత తిరిగి వచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆ బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్ అప్ కూడా జరిగింది అదే వేరే విషయం లెండి.

మల్లి సినిమాలు చేదాం అని ఇండస్ట్రీ కి తిరిగి వచ్చేసరికి ఇండస్ట్రీ మొత్తం కొత్త హీరోయిన్ లతో నిండిపోయింది, మంచి సినిమా అవకాశాలు అస్సలు రాలేదు శృతి హస్సన్ కి. అయినా సరే ఓపికతో ఆగి ‘వీర సింహ రెడ్డి‘ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత చిరంజీవి సినిమా వాల్తేర్ వీరయ్య లో నటించి మరో విజయాన్ని తన కాతాలో వేసుకుంది. లేటెస్ట్ గా ప్రభాస్ తో నటించిన సినిమా సలార్ కూడా హిట్ అవ్వటంతో శృతి ఫాన్స్ పండగ చేసుకున్నారు.

sruthi-haasan-lokesh-kanagaraj

ప్రస్తుతం లోకేష్ కానగరాజ్ తో కలిసి ‘ఇనిమెల్’ అనే మ్యూజిక్ లో నటించింది. ఆ ఆల్బం గురించి మాట్లాడుతూ శృతి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ముందు లోకేష్ కానగరాజ్ శృతి తో నటించేందుకు నిరాకరించాడు అట, తనతో నటించనంటే నటించను అని తేల్చి చెప్పేసాడు అట, కానీ ఒక్కసారి స్టోరీ విన్న తరువాత ఒప్పుకున్నాడు అట. ఇది ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది శృతి.

Exit mobile version