Home Cinema Taapsee : నా ప్రియుడికి ఆ టెస్ట్లు చేశాకే పెళ్లి చేసుకున్న.. తాపీసీ వ్యాఖ్యలు..

Taapsee : నా ప్రియుడికి ఆ టెస్ట్లు చేశాకే పెళ్లి చేసుకున్న.. తాపీసీ వ్యాఖ్యలు..

Taapsee : హీరోయిన్ తాప్సీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగమ్మ టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమా షూటింగ్‌లలో బిజీగా ఉన్నారు. అయితే ఈ బ్యూటీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్‌ తో ఎఫైర్ నడిపిన సంగతి మన అందరికి తెలిసిందే. ఈ జంట ఇటీవల ఉదయపూర్‌లో రహస్యంగా వివాహం కూడా చేసుకున్నారు. వీరి పెళ్ళికి సంబంధించిన వీడియోలు మరియు

ఫోటోలు కూడా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారాయి. అయితే ఇప్పటి వరకు తాప్సీ తన పెళ్లి గురించి, భర్తపై ప్రేమ గురించి పెద్దగా మాట్లాడలేదు. అయితే తొలిసారిగా ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ బ్యూటీ. తాప్సీ మాట్లాడుతూ, నా అభిప్రాయం ప్రకారం, మథియాస్ ని నేను మొదటి చూపులోనే చూసి ప్రేమించలేదు. నేను అతన్ని ప్రేమించే ముందు అతనికి కొన్ని పరీక్షలను కూడా పెట్టాను.

taapsee-tested-her-boyfriend-with-this-tests-before-marrying-him

మొదటి చూపులోనే ప్రేమలో పడిన అనుభవం మాకు లేదు. అతను నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా అని తెలుసుకోవడానికి నేను కొన్ని పరీక్షలు చేసాను. అన్ని టెస్టుల్లోనూ విజయం సాధించాడు మరియు నేను అతనిని చాలా ప్రేమించాను. నేను ఆయనను గౌరవిస్తాను. మేము కలిసిన ప్రతిసారి నేను అతనితో ప్రేమలో పడ్డాను అని తాప్సీ చెప్పింది. తాప్సీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version