Home Cinema Vijay Varma : మాల్దీవుల్లో అది చేశారా..? అభిమాని అడిగిన ప్రశ్నకి కోపంతో ఆ పని...

Vijay Varma : మాల్దీవుల్లో అది చేశారా..? అభిమాని అడిగిన ప్రశ్నకి కోపంతో ఆ పని చేసిన తమన్నా లవర్..!!

Vijay Varma : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. మంచు మనోజ్ సరసన శ్రీ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది ముద్దుగుమ్మ(Tamannah Vijay Varma). తీసిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో కెరీర్ మొదట్లో ఐరన్ లెగ్ గా ముద్ర వేసుకుంది. తరువాత తరువాత హ్యాపీడేస్, ఆవారా వంటి వరుస హిట్లు పడగానే అమ్మడి రేంజ్ అమాంతం పెరిగింది. దీంతో కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బాహుబలి తర్వాత అమ్మడు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది.

tamannah-vijay-varma-maldives-trip

అది ఇది అని కాకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇండస్ట్రీలో లాంగ్ రన్ లో కెరీర్ కొనసాగించిన హీరోయిన్లలో తమన్నా ఒకరు. లస్ట్ స్టోరీస్ 2 తర్వాత తమన్నా అందాలకు ఇండియా మొత్తం ఫిదా అయిపోయింది. నాలుగు పదుల వయసుకు దగ్గరపడుతున్న అమ్మడు కుర్రాళ్లకు తన అందాల వల విసురుతూనే ఉంది. ఏజ్ పైబడుతున్నా కొద్ది తమన్నా అందం మరింత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే 2023 మొదలైనప్పటినుండి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తమన్నా మరియు

విజయ్ వర్మల ప్రేమ వార్తలే గుప్పుమంటున్నాయి. ముఖ్యంగా వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలతో నెటిజన్లు కనువిందు చేస్తున్నారు. ఇక వీరిద్దరూ కలిసి తీసిన లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్ లో వారి రొమాన్స్ ను జనాలు ఇప్పట్లో మర్చిపోయేలా లేరు. ఈ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడే వారు ప్రేమలో పడ్డారని వార్తలు వినిపించాయి. అయితే ఎట్టకేలకు మేమిద్దరం ప్రేమలో ఉన్నామని వారు మీడియా ముందు ఒప్పేసుకున్నారు. ఇక అప్పటి నుంచి వారు బహిరంగంగానే పబ్బులు, పార్టీలు, డిన్నర్లు అంటూ తిరగుతున్నారు.

ఆ సందర్భంతో తీసిన వీళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా రజినీ కాంత్ సరసన జైలర్ సినిమాలో నటించింది తమన్నా. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి ఎంజాయ్ మెంట్ కోసం తమన్నా మాల్దీవ్స్ కి వెకేషన్ కి చెక్కేసింది. రీసెంట్ గా వెకేషన్ ఎంజాయ్ చేసిన తమన్నా విజయ్(Tamannah Vijay Varma) వర్మ ఇద్దరూ తిరిగి ఇండియాకి వచ్చారు. వస్తూ వస్తూ విజయ్ వర్మ తమన్నా ఇద్దరు వేరువేరుగా ఎయిర్ పోర్ట్ లో కనిపించారు.

అయితే తమన్నా మాత్రం ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయింది. దాంతో ఆమె వెనకాలే వచ్చినా విజయ్ వర్మని ఓ అభిమాని నేరుగా వెళ్లి.. ఓ సూటి ప్రశ్న అడిగారు. దీంతో ఆయనకు కోపం నషాలానికి అంటింది.. అలాంటి ప్రశ్న అభిమాని ఏం అడిగారంటే.. ఏంటి సార్ మాల్దీవ్స్ లో బాగా మజా చేశారా అంటూ అడిగాడు. దీంతో విజయ్ వర్మ కోపంతో ఏం మాట్లాడుతున్నారు.. ఇలా మాట్లాడొచ్చా అంటూ విజయ్ వర్మ ప్రశ్నించిన వ్యక్తిపై తీవ్ర అసహనాన్ని ప్రదర్శించాడు.

Exit mobile version