Shilpa Shetty : బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టికి దాదాపు 50 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ తన హాట్ అందాలతో యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతూనే ఉంది. అయితే ఈ క్యూటీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగానే అక్షయ్ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని భావించిందని, ఆ హీరోతో తొలిసారి కన్యత్వాన్ని కోల్పోయానని ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే అక్షయ్ కుమార్ శిల్పాశెట్టిని ప్రేమిస్తున్నట్లు నటిస్తూనే మరో హీరోయిన్ ను ప్రేమలో దింపారట.
ఆమె మరెవరో కాదు అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా. అయితే ఈ విషయాన్ని శిల్పాశెట్టి అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. నేను నా రేలషన్ షిప్ లో పూర్తిగా నిజాయితీగా ఉన్నాను కానీ అక్షయ్ కుమార్ నన్ను మోసం చేసాడు అని శిల్పా శెట్టి చెప్పింది. అయితే నన్ను ప్రేమిస్తున్నట్లు నటిస్తూనే అక్షయ్ కుమార్ నటి ట్వింకిల్ ఖన్నాతో ప్రేమలో పడ్డాడు. ఆమెతో ప్రేమలో ఉంటూనే నన్ను ప్రేమిస్తున్నట్లు నమ్మించి తన అవసరాలు తీర్చుకున్నాడు అని భయరంగంగా తెలిపింది.
అక్షయ్ కుమార్ పూర్తిగా నన్ను వాడుకున్నాడు మరియు తరువాత నన్ను విడిచిపెట్టాడు. ప్రేమ పేరుతో నన్ను మోసం చేశాడు. ఈ విషయాన్ని శిల్ప బాలీవుడ్ షో బిగ్ బ్రదర్‌లో చెప్పింది. అప్పట్లో శిల్పాశెట్టిని అక్షయ్ కుమార్ పెళ్లి చేసుకుంటాడని చాలా మంది అనుకున్నారు. అయితే అక్షయ్ కుమార్ శిల్పాశెట్టిని విడిచిపెట్టి ట్వింకిల్ ఖన్నాను పెళ్లి చేసుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత శిల్పాశెట్టి వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ని వివాహం చేసుకుంది.