Home Cinema Jagapathi Babu : జగపతిబాబు, ప్రియమణి పెళ్లికి అడ్డుపడిన స్టార్ హీరోయిన్..

Jagapathi Babu : జగపతిబాబు, ప్రియమణి పెళ్లికి అడ్డుపడిన స్టార్ హీరోయిన్..

Jagapathi Babu : ప్రియమణి గురించి ప్రత్యేకంగ పరిచయం చేయనక్కర్లేదు. పరుత్తివీరన్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకుని అందరి మన్ననలు పొందింది. అవార్డు దక్కడంతో ఇండస్ట్రీ మొత్తం తనమీద దృష్టి కేంద్రీకరించింది. దీంతో అమ్మడికి అవకాశాలు వెల్లువలా వచ్చాయి. జగపతి బాబు(Jagapathi Babu Priyamani) సరసన పెళ్లయిన కొత్తలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. దాదాపు టాప్ హీరోల అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.

priyamani-jagapathi-babu

ఇప్పటికి కూడా అమ్మడి హవా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. పెళ్లయిన కొత్తలో తర్వాత జగపతి బాబుతో అమ్మడికి సాన్నిహిత్యం బాగా పెరిగిందట. వారి ఫెయిర్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది. తర్వాత వారిద్దరు కలిసి ప్రవరాఖ్యుడు సినిమా కూడా చేశారు. ఆ సమయంలోనే ఈ ముద్దుగుమ్మ జగపతిబాబుని చాలా సిన్సియర్ గా లవ్ చేసిందట. అదే క్రమంలో అప్పటికే పెళ్లి అయిన జగపతిబాబును ప్రియమణి పెళ్లి చేసుకోవాలని భావించిందట. అయితే వీరిద్దరి మధ్య పుట్టిన ప్రేమకు ఓ హీరోయిన్ విలన్ గా మారిందట.

ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి హీరో జగపతి బాబు లక్ష్మీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి ప్రేమకు నిదర్శనంగా ఇద్దరు ఆడ పిల్లలు కలిగారు. అయితే సినిమాల్లోకి వచ్చాక జగపతి బాబు చాలామంది హీరోయిన్లతో ఎఫైర్ నడిపించినట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. ఆ జాబితాకు చెందిన హీరోయిన్ ప్రియమణి. ఆ జంట ఇప్పటికే పెళ్లైన కొత్తలో, క్షేత్రం, ప్రవరాఖ్యుడు వంటి సినిమాల్లో నటించారు. ఇలా సినిమాల్లో చేస్తున్న టైంలో వీరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారిందట.

జగపతి బాబు కంటే కూడా ప్రియమణి ఆయను చాలా గాఢంగా ప్రేమించిందట. కానీ హీరో జగపతిబాబు మాత్రం ప్రియమణి ప్రేమను మాత్రం అంత సీరియస్ గా తీసుకోలేదట. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే జగపతిబాబుకు అప్పటికే పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక జగపతిబాబు(Jagapathi Babu Priyamani) కు కూడా ప్రియమణి కేవలం క్రష్ మాత్రమే ఉంది. ఆ క్రష్ తో హైదరాబాదులో ప్రియమణి ఉండేందుకు ఓ ఫ్లాట్ కూడా కొనిచ్చాడని ఇండస్ట్రీలో తెగ ప్రచారం నడిచింది.

అయితే వీరి మధ్య రిలేషన్ నడుస్తున్న తరుణంలో గాయం2 సినిమాలో జగపతిబాబు విమల రామన్ కలిసి జంటగా నటించారు. ఆ
సమయంలోనే జగపతిబాబు ప్రియమణి ని దాదాపు పట్టించుకోవడం మానేశారట. ఇక విమలా రామన్ రాకతో జగపతిబాబు పూర్తిగా ప్రియమణిని దూరం పెట్టేశాడట. తనతో టైం స్పెండ్ చేయడంతో ప్రియమణి జగపతిబాబుకి బ్రేకప్ చెప్పి తన దారి తాను చూసుకుందట. ఇలా విమల రామన్ వల్లే వారి మధ్య రిలేషన్ చెడిందంటూ ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతోంది.

Exit mobile version