Hero Abbas : సినిమా ఇండస్ట్రీలో కొత్త కొత్త హీరోలు వస్తున్న కూడా పాత హీరోలకు ఫ్యాన్ బేస్ ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. వారు కొని సంవత్సరాల క్రితం సినిమాలు చేయడం ఆపేసిన కూడా వారి అభిమానులు వారిని ఇంకా ఆరాధిస్తుంటారు. వారిని ఓ దైవంలా పూజిస్తుంటారు. ఇలాంటి హీరోల లిస్ట్ లో మొదట ఉండేది హీరో అబ్బాస్ అని చెప్పొచ్చు. అబ్బాస్.. ఈ పేరు వింటే ఇప్పటి జెనరేషన్ వాలు ఎవరు ఈయన అని ఆశ్చర్యపోవచ్చు గాని 90s జెనరేషన్ వాలు మాత్రం ఈయన నటనకు మంత్రముగ్దులయ్యారు.
హీరో అబ్బాస్ కు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా గట్టిగానే ఉంది. అబ్బాస్ అపాపిట్లో లవ్ స్టోరీలు చేసేవారు మరియు ఈయన చేసిన సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అబ్బాస్ అంటే అమ్మాయిలు పది చచ్చిపోయేవారు.. ఎందుకంటే ఆయన అప్పట్లో ఉన్న హీరోలలో హ్యాండ్ సమ్ హీరో అని చెప్పుకోవచ్చు. ఈయన ప్రేమ దేశం అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు మరియు ఆ సినిమా బారి విజయం సాధించి ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగాడు.
అబ్బాస్ ఎంత త్వరగా స్టార్ డమ్ అందుకున్నాడా అంతే త్వరగా ప్లాపులు కూడా తన కెరీర్లో చెవిచూసాడు. ఈయన ఆ తరువాత సినిమాలలో సైడ్ హీరో(Hero Abbas) గా తన సినిమా కెరీర్ ను మల్లి ఓ పీక్స్ స్టేజ్ కు తీసుకువెళ్లాడు. అబ్బాస్ పెద్ద పెద్ద స్టార్ హీరోలతో నడిచాడు మరియు విజయం అందుకున్నాడు. అయితే ఇపుడు అబ్బాస్ గురించి ఓ వార్తా వైరల్ అవుతుంది. ఇది ఆయన సినిమా లైఫ్ గురించి అనుకుంటున్నారేమో.. కాదు ఇది ఆయన పర్సనల్ లైఫ్ కు సంబంధించింది.
ఈ మధ్య కాలంలో అబ్బాస్ అసలు సినిమాలు చేయకపోయినా ఇంస్టాగ్రామ్ ద్వారా ఆయన అభిమానులతో ఇంటరాక్టివ్ గా ఉంటాడు. అయితే అబ్బాస్ పర్సనల్ లైఫ్ లో కి వెళితే, ఆయన ఇటీవల తన ఇంస్టాగ్రామ్ ఇంటరాక్టివ్ సెషన్లలో ఓ విషయం తెలియజేసాడు. ఆయన కాలేజీ రోజులలో ఓ అమ్మాయిని ఇష్టపడరు అంట. ఆమె కూడా అబ్బాస్ ను ప్రేమించానని చెప్పిందంట. కొద్దీ రోజులు ఇద్దరు ఎంచక చెట్టా పట్టాలు ఏసుకొని తిరిగారట. కొని రోజులు గడిసక ఆమె అబ్బాస్ తో బ్రేక్ అప్ చేసుకుందట.
అలా అతను మోసపోయా అని బాధపడి, డిప్రెషన్ కు లోనయి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడట. అబ్బాస్ చనిపోదాం అని నది రోడుపై నించుండిపోయాడట మరియు ఎదురుగా ఓ లారీ కూడా వస్తుందట. అయితే చివరి నిమిషంలో లారీ వెనక ఓ బండి రావడం అబ్బాస్ గమనించి పక్కకు తప్పుకున్నాడట. లేకుంటే లారీ వాడు సడన్ బ్రేక్ కొడితే వెనకాల బైక్ మీదున్న అతను కూడా లారీని గూడేస్తాడేమో అని బయపడి ఆయన తప్పుకున్నారని తెలియజేసారు. ఇలాంటి చేదు అనుభవాలు ఎన్నో వస్తుంటాయి కానీ మన వాళ్ళ వేరేవాళ్లు బాధపడొద్దని అబ్బాస్ నమ్మేవారట.