Home Cinema Rashmika : రష్మికకు పెద్ద షాక్ ఇచ్చిన యంగ్ హీరోయిన్.. బారి బొక్క పెట్టింది..

Rashmika : రష్మికకు పెద్ద షాక్ ఇచ్చిన యంగ్ హీరోయిన్.. బారి బొక్క పెట్టింది..

Rashmika : అందాల నటి రష్మిక మందన్న హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి సుపరిచితురాలు. ఈమె స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ఆమె సత్తా చాటుకుంది. అయితే ప్రస్తుతం ఇంత స్టార్ డోమ్ ఉన్న హీరోయిన్ కు పెద్ద షాక్ ఇచ్చింది ఓ టాలీవుడ్ నటి. ఆమె మరెవరో కాదు నటి శ్రీలీల. అవును మీరు వినేది నిజమే. నటి శ్రీలీల చిన్న వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఈమె మొదట్లో నటించిన సినిమాలు మంచి సక్సెస్ అందుకుంది.

కానీ ప్రస్తుతం ఈమె నటించే సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. కానీ శ్రీలీల కంబ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అయితే చాలా కాలం తర్వాత శ్రీలీల ఓ తెలుగు సినిమాకు సైన్ చేసింది. సమాజవరగమన రచయిత భాను బొగ్గవరపు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా రవితేజ కెరీర్‌లో 75వ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. అయితే ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తుందని అధికారిక ప్రకటన వచ్చింది.

young-heroine-gave-big-shock-to-rashmika-mandanna

నిజానికి ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్నను అనుకున్నారు యూనిట్. అయితే రష్మిక ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో డైరెక్టర్ ఈ ఛాన్స్ ను శ్రీలీలాకు ఇచ్చారు. ఈమె తక్కువ రెమ్యునరేషన్‌తో ఈ చిత్రాన్ని అంగీకరించింది. గతంలో ధమాకా సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ధమాకా సినిమాలో హీరోయిన్‌గా రష్మికను అనుకున్నారు. కానీ శ్రీలీల కొద్దిపాటి ఫీజు డిమాండ్ చేయడంతో మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు రష్మిక ప్రపోజల్‌ శ్రీలీల చేతికి చిక్కింది అంటూ వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.

Exit mobile version