Home Cinema Vishwak Sen : మెకానిక్ రాకీ రూమర్స్ పై స్పందించిన విశ్వక్ సేన్.. క్లారిటీ ఇచ్చేసాడు..

Vishwak Sen : మెకానిక్ రాకీ రూమర్స్ పై స్పందించిన విశ్వక్ సేన్.. క్లారిటీ ఇచ్చేసాడు..

vishwak-sen-responded-on-fake-news-about-mechanic-rocky-theatrical-rights

Vishwak Sen : టాలీవుడ్ హీరో యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన ఈ నగరానికి ఏమైంది అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచామయాడు. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు విశ్వక్. అక్కడనుండి ఈయన నటన రంగంలో వెనక్కి తిరిగి చూడలేదు. వరుస సినిమాలతో దూసుకుపోయారు. విశ్వక్ సేన్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బానే సంపాదించుకున్నాడు.

ఈయన చివ‌రిసారిగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రిలో న‌టించాడు. దురదృష్టవశాత్తు ఇది బాక్సాఫీస్ అంచనాలను అందుకోలేకపోయింది. ఈయన తదుపరి దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో మెకానిక్ రాకీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ విషయంలో హీరో విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మెకానిక్ రాకీ చిత్రాన్ని సౌత్ రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులకు ఏషియన్ సురేష్ 8 కోట్ల రూపాయల నాన్ రిఫండబుల్ అడ్వాన్స్‌కి కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. విశ్వక్ ఈ పోస్ట్ పై ఇలా సమాధానమిచ్చాడు. “గాడిద గుడ్డు ఎం కాదు!!” ప్రియాజీ, టీ షాప్ దెగర ముచ్చట్లు ని తీసుకుని ట్విటర్ లో పోస్ట్ చేయకండి. మెకానిక్ రాకీ యొక్క రైట్స్ ఇంకా విక్రయించబడలేదు. వాస్తవాలను సరిగ్గా పొందండి అని అతను రిప్లై ట్వీట్ ఇచ్చాడు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.

Exit mobile version