Home Cinema తనతో నటించాలంటూ జాన్వీ కపూర్ వెంటపడుతున్న తెలుగు హీరోలు..

తనతో నటించాలంటూ జాన్వీ కపూర్ వెంటపడుతున్న తెలుగు హీరోలు..

అతిలోక సుందరి నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. బాలీవుడ్ లో పలు సినిమాలు చేసి సక్సెస్ రాక తల్లికి సక్సెస్ ఇచ్చిన ఇండస్ట్రీలో తన అదృష్టం పరీక్షించు కోవటానికి టాలీవుడ్ లో అరంగేట్రం చేయబోతుంది. అలాంటి ఇలాంటి అరంగేట్రం కాదు డైరెక్ట్ పాన్ ఇండియా హీరోలతోనే మొదలు పెట్టబోతోంది. ఇప్పటివరకు ఎపుడు తెలుగు సినిమాలో నటించని జాన్వీ కపూర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పక్కన నటించే అవకాశం ఎలా వచ్చింది ఎవ్వరికి అర్ధం కానీ విషయం.

janhvi-kapoor-ram-charan

మనం ఒకటి గుర్తుకు పెట్టుకోవాలి తను ఎవరని, శ్రీదేవి కూతురు ఆ కాలంలో తినకన్నా అందగత్తెలు ఇంకెవరు లేరు. తన కూతురే జాన్వీ కపూర్ అందుకే ఇన్ని అవకాశాలు వస్తున్నాయి. అమ్ముడు ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన ‘దేవర’ అనే సినిమా లో చేస్తూనే, రామ్ చరణ్ సరసన మరో సినిమా చేస్తుంది. ఇద్దరు పెద్ద హీరోలతో ఒకేసారి సినిమా అవకాశం పొందటం మాములు విషయం కాదు.

ఇండస్ట్రీలో ఇంత మంది హీరోయిన్లు ఉన్న స్టార్ హీరోలు మాత్రం జాన్వీ కపూర్ నే కోరుకుంటున్నారు. అంతే కాకుండా తిను మరో రెండు సినిమాలో కూడా కనిపించబోతుంది అట. ఆ సినిమా పేరులు ఏంటి అనేవి అతిత్వరలో అధికారిక ప్రకటన రానుంది. జాన్వీని చూసి ఎంతో కాలంగా కష్ట పడుతున్న కుర్ర హీరోయిన్లు తెగ కుళ్ళుకుంటున్నారు అట. వాళ్ళు కుళ్ళుకోవటంలో న్యాయం ఉంది, కానీ మనము చేసేది ఏంలేదు, తాను శ్రీదేవి కూతురు. టాలీవుడ్ లో ప్రతి హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ లకు తనంటే ఎంతో ప్రేమ, గౌరవము. మరి అలాంటి నటి కూతురుకి ఛాన్స్ ఇవ్వటంలో వాళ్ళ తప్పు ఏంలేదు.

Exit mobile version