Sreenu Vaitla : టాలీవుడ్ లో ఎన్నో కల్ట్ క్లాసిక్ చిత్రాలను తీసి మనల్ని కడుపుబ్బా నవ్వించిన దర్శకుడు శ్రీను వైట్ల గత కొంత కాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రవితేజ తో తీసిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే చిత్రం శ్రీనువైట్ల చివరి చిత్రం. ఆ తర్వాత ఆయన మంచు విష్ణు మరియు గోపీచంద్ వంటి వారితో సినిమాలు చెయ్యబోతున్నాడు అని సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నా, ఇప్పటి వరకు ఈ రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్ళలేదు. శ్రీను వైట్ల సినిమాలకు దూరం అయ్యి ఉండొచ్చు కానీ, ఇప్పటి వరకు ఆయన అభిమానులకు మాత్రం దూరంగా లేడు.
సోషల్ మీడియా ద్వారా మొదటి నుండి ఆయన ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉన్నాడు. ప్రతీ రోజు తన జీవితం లో జరిగే సంఘటనలను పంచుకుంటూ వచ్చేవాడు. అయితే నిన్న ఆయన పెట్టిన ఒక పోస్ట్ అభిమానులను కంటతడి పెట్టేలా చేస్తుంది. అదేమిటంటే శ్రీనువైట్ల(Sreenu Vaitla) గత కొన్నేళ్ల నుండి ఒక ఆవుని పెంచుకుంటూ ఉండేవాడట. ఈ ఆవు నేడు అనారోగ్యం తో చనిపోయింది. ఈ విషయాన్నీ సోషల్ మీడియా లో అభిమానులతో పంచుకుంటూ ఒక పోస్ట్ పెట్టాడు శ్రీనువైట్ల. ఈ ఆవు ని మేము కేవలం ఒక జంతువు లాగ చూడలేదు, మా ఇంటి సభ్యురాలిగా చూసాము.
నా కూతురు తో ఈ ఆవుకి ఎంతో మంచి కనెక్షన్ ఉంది. తాను ఈ ఆవుని లక్ష్మీ అని ప్రేమగా పిలిచేది. ఇప్పుడు మా లక్ష్మీ చనిపోయింది అంటూ ఎంతో ఎమోషనల్ గా ఒక పోస్ట్ పెట్టాడు. దీనికి ఫ్యాన్స్ నుండి శ్రీను వైట్ల కి సోషల్ మీడియా ద్వారా ఎంతో ఓదార్పు వచ్చింది. దైవం తో సమానమైన ఆవుని ఇంత గౌరవించడం ని చూసి మీ మీద ఉన్న గౌరవం మాలో 100 రెట్లు పెరిగింది అంటూ కామెంట్ చేసారు. మీకు ఆ దేవుడు రాబొయ్యే రోజుల్లో అన్నీ మంచే చేస్తారు, టాలీవుడ్ లో మళ్ళీ మీ పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నాము.
అలాగే మీ లక్ష్మీ చనిపోయినందుకు మా తరిమిన నుండి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాం అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేసారు. కెరీర్ లో ఏంన్నో సూపర్ హిట్స్ ని అందుకున్న శ్రీను వైట్ల చాలా కాలం నుండి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో డీలాపడిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు త్వరలో గోపీచంద్ తో చెయ్యబోయే సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి.
శ్రీను వైట్ల ప్రస్తుతం మంచు విష్ణు తో కలిసి డబల్ డోస్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమా గురించి కేవలం చేస్తున్నారు అనే సమాచారం తప్ప ఇంకేమి తెలీదు. ఈ సినిమా స్టోరీ ఏంటి, అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు, కాస్ట్ ఎవరు ఇవ్వని తెలియాల్సి ఉంది.